Friday, September 12, 2025 06:33 PM
Friday, September 12, 2025 06:33 PM
roots

జగన్ ధైర్యం కంటే సుప్రీం భయమే వైసీపీని డామినేట్ చేస్తుందా..?

గత ఏడాది వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. ఆ పార్టీ నాయకులు చాలా మంది ప్లాస్టిక్ కింగ్ లు అనేది జనాలకు క్లారిటీ వచ్చింది. రాను రాను వైసీపీ బంగ్లాదేశ్ క్రికెట్ టీం మాదిరి తయారు అయిందని ఆ పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆడే ఆట కంటే.. మాట్లాడే మాటలు ఎక్కువ ఆ టీంకి. ఇప్పుడు వైసీపీ కూడా అలాగే మారిపోయింది అనే భావన వినపడింది. అధికారంలో ఉన్న సమయంలో చిటికెలు వేసి టీడీపీ, జనసేన పార్టీలను బెదిరించిన నాయకులు.. రెండు చేతులు కలిపి పట్టుకుని కూర్చున్నారు.

Also Read : కలవలేదు.. అయినా కలిస్తే తప్పేంటి..?

జగన్ ఎన్ని సార్లు.. బయటకు వచ్చేలా ప్రోత్సాహం ఇచ్చినా సరే చాలా మంది నాయకులు బయటకు రావడానికి ముందుకు రావడం లేదు. లేటెస్ట్ గా ఆయన ఓ ప్రెస్ మీట్ పెట్టి.. పార్టీ నాయకులకు కాస్త బూస్ట్ ఇచ్చారు. ప్రభుత్వం మరో మూడేళ్ళే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, మనమే వస్తామని చెప్పారు, నాయకులు బయటకు రావాలన్నారు. జగన్ అలా చెప్పారో లేదో.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సుప్రీంలో ముందస్తు బెయిల్ విషయంలో షాక్ తగిలింది.

Also Read : ఫాం హౌస్ లో జగన్ తో కేటిఆర్ భేటీ

ఆ తర్వాత.. లిక్కర్ స్కాంలో కీలకంగా భావిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు సుప్రీం కోర్ట్. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తిరుగుతున్నారు. ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉండవచ్చు. వంశీ సంగతి పక్కన పెడితే జగన్ తర్వాత పార్టీలో కీలకంగా భావించే మిథున్ రెడ్డికే జగన్ బెయిల్ ఇప్పించలేదు. వంశీ.. జైలులో ఎన్నో కష్టాలు పడ్డాడో కళ్ళారా చూసారు. ఇలాంటి టైంలో గోక్కుని తమ అక్రమాలపై కేసులు నమోదు చేయించుకోవడం ఎందుకు అనే భావన చాలా మంది వైసీపీ నాయకుల్లో ఉండవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్