Thursday, February 5, 2026 02:40 AM
Thursday, February 5, 2026 02:40 AM

జోగి.. కేరాఫ్ కులం కార్డు..!

జోగి రమేష్.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో మేటి. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం.. ఓడిపోయిన తర్వాత ఎదురు దాడి చేయడం.. ఇదే జోగి స్పెషల్. ఇంకా చెప్పాలంటే.. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా కులం కార్డు కూడా తీస్తారు. బీసీలపై కక్ష.. బీసీల పైన చిన్న చూపు.. అంటూ బేల కబుర్లు అన్నీ చెబుతారు. అదే అధికారంలో ఉన్నప్పుడు అయితే మాత్రం కులం చూడం.. మతం చూడం.. అందరికీ సమన్యాయం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతారు. సొంత పార్టీ నేతలపై కూడా రాజకీయాలు చేయటానికి కూడా జోగి వెనుకాడలేదు. రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోవడానికి జోగి కారణమనేది సొంత పార్టీ నేతలే చేస్తున్నా ఆరోపణ. అయినా సరే.. అధినేత దగ్గర మాత్రం.. నేనే మీ బానిసను.. మీరే నా దేవుడు.. అంటూ కబుర్లు చెప్పి.. కాలం గడిపేస్తుంటారు.

అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఏ స్థాయికైనా దిగజారేందుకు జోగి రెడీగా ఉంటారని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే.. క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జోగి రమేష్.. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. పుట్టింది ఇబ్రహీంపట్నం అయినప్పటికీ.. 2009లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. కాంగ్రెస్ పార్టీ పైనే విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో రెండోసారి సొంత నియోజకవర్గం మైలవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సొంత నియోజకవర్గం కలిసి రాలేదని భయపడిన జోగి.. 2019లో మళ్లీ పెడన నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో చోటు కోసం తెగ తాపత్రయపడ్డారు జోగి. నాటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ను తిడితే చాలు.. అధినేత ప్రసన్నం అవుతారని.. మంత్రిపదవి ఇస్తారని బలంగా నమ్మిన జోగి.. తన నోటికి పని చెప్పారు.

Also Read: అలాంటి వారితోనే ఇబ్బందులు.. బాబు నైరాశ్యం..!

టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత, జెడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న చంద్రబాబు ఇంటి పైకి దాడికి వెళ్లారు. ఏకంగా వెయ్యి మందిని వెంటేసుకుని దాడికి యత్నించారు జోగి. ఈ విషయం అంతా.. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో.. జోగి పైన అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే.. నాటి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇక జోగి చేష్టలకు మెచ్చిన నాటి సీఎం వైఎస్ జగన్.. తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయారు. అధినేత జగన్ కళ్లల్లో ఆనందం కోసం పవన్ కల్యాణ్‌పైన, చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైకోలు రెచ్చిపోయారు. మహిళలపై దాడులు.. అడ్డుకున్న వారిని హత్య చేసేందుకు కూడా తెగబడ్డారు. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో అమర్ నాథ్ గౌడ్ అనే యువకుడు తన సోదరిని ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు వైసీపీ రౌడీ మూకలు పెట్రోల్ పోసి హత్య చేశారు.

Also Read: చంద్రబాబు ఫోటోతో రాజకీయం

ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అయితే ప్రభుత్వం తరఫున రాయభారం నడిపిన జోగి రమేష్.. ప్రతి విషయంలో బీసీ అనే మాట.. కులం అనే మాట ఎందుకు అని ఆ రోజు మీడియా ముందు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి.. మైలవరం నియోజకవర్గంలో కూడా రాజకీయాలు చేశారు. నాటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు నడిపారు. ఈ విషయంపై కృష్ణప్రసాద్ బహిరంగంగానే విమర్శలు చేశారు. అదే సమయంలో పెడనలో కూడా స్థానిక నేతల మధ్య కులం చిచ్చు పెట్టారు. ఈ పంచాయతీ అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరింది. ఇక ఎన్నికల్లో ఓడిన తర్వాత జోగి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Also Read: చంద్రబాబు ఫోటోతో రాజకీయం

అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్, కల్తీ మద్యం తయారీ.. ఇలా ఒకటేమిటి.. లెక్కలేనన్ని.. ఈ కేసుల్లో జోగి రమేష్ ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి.. తాను బీసీ అని.. గౌడ సామాజికవర్గానికి చెందిన తనను కూటమి ప్రభుత్వం వేధిస్తోందంటూ కులం కార్డు తీశారు. జోగి కుమారుడిని అరెస్టు చేసినప్పుడు.. కల్తీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్‌ను అరెస్టు చేసినప్పుడు కూడా కులం కార్డు ప్రయోగించేందుకు నానా పాట్లు పడ్డారు. బీసీలపై కుట్ర, బీసీలపై వేధింపులు.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు జోగి. చేసిన తప్పు బయటపడటంతో.. ప్రమాణాలు చేస్తా.. బీసీ నేత.. అంటూ జోగి నాటకాలు ఆడుతున్నారని… సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్