Thursday, February 5, 2026 12:45 AM
Thursday, February 5, 2026 12:45 AM

కుల సర్పం.. బుసలు కొడుతుందా..?

కుల సర్పం.. బుసలు కొడుతుందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. నిజమే.. అంశం ఏదైనా సరే.. దానికి కులాన్ని అంటగడుతున్నారు. అది ఎలాంటి సంఘటన అయినా సరే.. తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కులాల కుంపట్లు రాజేస్తున్నారు. అసలు ఏ విషయమైనా సరే.. దానికి కులాన్ని ఆపాదిస్తున్నారు. ఇక ఎవరి పై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చాలు.. ఆ కులంపై దాడి అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం.. ఆ కులాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం.. ఇదే ఇప్పుడు ట్రెండింగ్. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. ఇంకా చెప్పాలంటే.. కొందరు నేతలైతే.. కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవటమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు.

Also Read : ట్రంప్, మస్క్ మధ్య ప్యాచ్ అప్.. ఇద్దరూ సెట్ అయినట్టే..?

ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టడమే కొందరు నేతల ఏకైక లక్ష్యం. ఇలాంటి వారిలో టాప్ టెన్ ర్యాంకులు వైసీపీ నేతలకే దక్కుతాయి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వ్యాఖ్యానించారు. ఓడిన తర్వాత మాత్రం.. కులంపై దాడి.. బీసీలను అణగదొక్కే ప్రయత్నం.. అంటూ వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో లెక్కలేనన్ని అక్రమాలు చేశారు. చేసిన పాపానికి ఎప్పటికైనా సరే ఫలితం అనుభవించాల్సిందే. అందుకే కూటమి సర్కార్ ఒక్కొక్క నేతపై చర్యలు తీసుకుంటోంది. తన మన అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేస్తే వాళ్లను శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపుతోంది. దీనినే వైసీపీ నేతలు కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కులాన్ని ఆపాదిస్తున్నారు.

Also Read : సజ్జల అరెస్ట్ ఖాయం.. లోకేష్ ట్వీట్ ఇచ్చిన సిగ్నల్..?

మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ భూములను అప్పనంగా కాజేశారు జోగి రమేశ్. విలువైన భూములను కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వర్రావు పేరుతో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రిజస్టర్ చేయించుకున్నారు. భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి.. ఏడు ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు రాజీవ్‌, వెంకటేశ్వర్రావును అరెస్టు చేశారు. వెంటనే జోగి రమేశ్ బయటకు వచ్చి.. ఇది బీసీ నేతపై దాడి అని.. తన కుమారుడిని రాజకీయంగా అడ్డుకునేందుకే ఇలా తప్పుడు కేసు పెట్టారని.. కులం కార్డు తీశారు. మరి ఇదే జోగి రమేశ్.. బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలో ఓ బీసీ బాలుడిపై పెట్రోల్ పోసి హత్య చేసినప్పుడు మాత్రం… కులం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని మీడియాపైన, స్థానికుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ట్రంప్ కు చుక్కలు చూపిస్తున్న గవర్నర్

ఇక కులం ప్రస్తావన తీసుకురావడంలో.. కులం పేరుతో రాజకీయం చేయడంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం.. కాపుల హక్కులు, రిజర్వేషన్ అంశం గుర్తుకు వస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం.. ఈ గజినీ ఆ విషయమే మర్చిపోతారు. 2014-19 మధ్య కాలంలో కాపు సంఘం నేత అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చివరికి ఈయన చేపట్టిన కార్యక్రమం వల్ల తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. టీడీపీ ఓడిన వెంటనే ఉద్యమ కాడి దింపేశారు. మళ్లీ సరిగ్గా 2024 ఎన్నికల వేళ టార్గెట్ చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. కాపు ద్రోహులు అంటూ భారీ డైలాగులు వేశారు. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా అని సవాల్ చేశారు. చివరికి తన పేరు చివర రెడ్డి తగిలించుకున్నారు కూడా.

Also Read : ఆ నేతల వారసులు ఏమయ్యారు..?

ఇక మరో ముఖ్య నేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ఆయన ఎవరో కాదు.. సంజన, సుకన్య అంటూ ఫోన్ కాల్‌తో రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కులాల మధ్య చిచ్చు పెట్టడంలో ఈయన సిద్ధహస్తులు. ఎలా అంటే.. ఎన్నికలకు ముందు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అంబటి. ఆ సమయంలో మా వీధిలో రోడ్డు లేదని ప్రశ్నించిన ఓ వ్యక్తిని.. నువ్వు ఎవరికి ఓటు వేశావు.. నీది ఏ కులం అని ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది కూడా. 2019 ఎన్నికల్లో కొడెల శివప్రసాద్ పై పోటీ చేసిన సమయంలో కమ్మ – కాపు అంటూ కుల సంఘం మీటింగ్ పెట్టి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి తనలోని కుల పిశాచిని నిద్ర లేపారు అంబటి.

Also Read : జనంలోకి టీడీపీ.. టార్గెట్ ఫిక్స్..!

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే చెప్పలేమంటారు కానీ.. ఎవరు ఏ కులానికి చెందిన వారని అడిగితే మాత్రం ఠక్కున చెప్పేస్తారు. వైసీపీ నిరసన ప్రదర్శనలో భాగంగా గుంటూరులో సీఐపై దాడికి ప్రయత్నించారు. ఆ వీడియో అందరూ చూశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు అంబటి. ర్యాలీకి అనుమతి లేదన్న సీఐపై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అంబటి కులం కార్డు వాడారు. కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా.. కేసులకు నేను భయపడాలా… అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు అక్రమమంటూ మరో పోస్ట్ పెట్టారు అంబటి. అదేమిటంటే… కొమ్మినేని కమ్మ అయ్యి తనను విమర్శిస్తు్న్నాడని బాబు శిక్ష.. అని పోస్ట్ పెట్టాడు. మరి ఇది కాదా కులాలను రెచ్చగొట్టడం.. ఇది కాదా కులాల మధ్య చిచ్చు పెట్టడం. కమ్మ, కాపు అనే పదాలు ఎందుకు.. తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే.

Also Read : బ్రేకింగ్: వేశ్య కామెంట్స్ పై జాతీయ మహిళా కమీషన్ సీరియస్.. డీజీపీకి లేఖ

ఇది వైసీపీలో ప్రతి నేతకు అలవాటుగా మారిపోయింది. చిలకలూరిపేటలో సీఐ సుబ్బరాయుడుపై దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి విడదల రజినీ.. తిరిగి ఆమె ఓ బీసీ మహిళపై దాడి చేస్తారా అంటూ గగ్గొలు పెట్టారు. ఇక మరో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే.. కులం ప్రస్తావన లేకుండా గడపలేక పోయారు. ఎంపీగా ఉన్నప్పుడు న్యూడ్ వీడియో కాల్స్ చేసిన గోరంట్ల.. ఓ బీసీ నేతపై తప్పుడు ప్రచారం అని కులం ప్రస్తావన చేశారు. ఇక ఐ టీడీపీ కార్యకర్త కిరణ్‌పై దాడికి యత్నించిన సమయంలో కూడా గోరంట్లను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా ఓ బీసీ నేతను కూటమి సర్కార్ వేధిస్తోంది అంటూ కులాల ప్రస్తావన తీసుకువచ్చారు తప్ప.. స్వతహాగా ఓ పోలీసు అధికారి అయ్యుండి.. మరో పోలీసుతో దురుసుగా ప్రవర్తించినందుకే ఇలా అరెస్టు చేశారని మాత్రం అనలేదు.

Also Read : దుమ్ము రేపిన బాలయ్య.. షేక్ చేస్తున్న అఖండ తాండవం

నాలుగు రోజుల క్రితం తెనాలిలో పర్యటించిన వైఎస్ జగన్.. దళితులపై పోలీసుల దౌర్జన్యం అని కులం ప్రస్తావనే చేశారు. అంతే తప్ప.. వాళ్లు గంజాయి బ్యాచ్ అని… కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకే ఇలా పోలీసులు చర్యలు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఏపీలో అభివృద్ధి అనే విషయాన్ని పక్కన పెట్టిన వైసీపీ నేతలు.. ఎంత సేపు కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలికాచుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అది ఏ విషయమైనా సరే.. అది ఎలాంటి అంశమైనా సరే అధినేత చూపించిన మార్గంలోనే నేతలు, కార్యకర్తలు కూడా నడుస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్