వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాదనేది వైసీపీ నేతలు, కార్యకర్తల మాట. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలపైనే చర్చించుకుంటున్నారు. 30 ఏళ్లు మనదే అధికారం అని గొప్పగా చెప్పుకున్న జగన్… సరిగ్గా ఐదేళ్లలోనే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారిపోయారు. కుప్పం, మంగళగిరి కూడా మనవే చెప్పిన వైసీపీ అధినేతను ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారు. దీంతో ఏం చేయాలో కూడా దిక్కుతోచని స్థితిలో వైఎస్ జగన్ కొట్టుమిట్టాడుతున్నారనేది వాస్తవం. సాధారణంగా రాజకీయ పార్టీలకు, నేతలకు గెలుపు ఓటములు సహజం. అంత మాత్రానికే ఏ పొలిటిషన్ కూడా ఢీలా పడిపోరు. వరుసగా 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు… పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా సీఎం కుర్చీ అంత ఈజీగా రాలేదు. సుదీర్ఘ పాదయాత్ర, అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలు, క్యాడర్‌తో మమేకం వంటి వాటివల్లే వరుసగా రెండోసారి కూడా సీఎం కుర్చీలో వైఎస్ఆర్ కూర్చున్నారు.
Also Read : ఏపీకి కొత్త బ్రాండ్ అంబాసీడర్లు
అయితే జగన్ తీరు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాకుండా… పాదయాత్ర చేశారు. ఒక్కఛాన్స్ అంటూ ముద్దులతో ఓటు అడిగారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్‌ను, నేతలను ఏ మాత్రం పట్టించుకోలేదు. సీఎం కుర్చీలో కూర్చోక ముందు… కూర్చున్న తర్వాత అన్నట్లుగా జగన్ మారిపోయాడు. నాయకులను దగ్గరకు రానివ్వలేదు. క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకోలేదు. ఎంతసేపు దోచుకో దాచుకో అన్నట్లుగానే వ్యవహరించారు. ఇక 2024 ఎన్నికల సమయంలో కూడా అభ్యర్థుల ఎంపిక అంతా నా ఇష్టం అన్నట్లుగానే చేశారు జగన్. చివరి నిమిషంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు. దీంతో కొత్త అభ్యర్థులు క్యాడర్‌తో మమేకం కాలేక నానా పాట్లు పడ్డారు.
Also Read : మిస్టర్ జగన్ రెడ్డీ….నోరు అదుపులో పెట్టుకో : ఏబీ వెంకటేశ్వరరావు
అయితే ఎన్నికల తర్వాత కొంతమంది సీనియర్ నేతల విషయంలో ఇప్పుడు జగన్ ఇలాగే వ్యవహరిస్తున్నారు. కిందిస్థాయి కార్యకర్త అభిప్రాయం ఏ మాత్రం తెలుసుకోకుండా నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమిస్తున్నారు. దీంతో పాత కొత్త నేతల మధ్య ఏ మాత్రం సమన్వయం లేకుండా పోతోంది. ఇదే విషయాన్ని అధినేతకు చెప్పేందుకు కొందరు నేతలు ప్రయత్నించినప్పటికీ.. జగన్ మాత్రం పూర్తిగా బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితమయ్యారు. ఏ విషయం అయినా సరే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతితో చర్చించాలని చెప్పడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన సజ్జలకే మళ్లీ ఎలా నమ్ముతున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇంఛార్జులను ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏమిటని కూడా నిలదీస్తున్నారు. అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

