ఏపీలో అభివృద్ధి కంటే.. కులాల కుంపట్లకే పెద్ద పీట వేస్తారు రాజకీయ నేతలు. ఇలా కుల రాజకీయాలు చేయడంలో.. కులాల మధ్య తగవులు పెట్టడంలో ఏపీలో చాలా మంది రెడీగా ఉంటారు. ఇలాంటి వారిలో సింహభాగం చంద్రబాబు వ్యతిరేకులే ఎక్కువ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్లకు కులం గుర్తుకు వస్తుంది. తమ కులానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తారు. అదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం.. ఈ సో కాల్డ్ పెద్ద మనుషులు నోరు కూడా ఎత్తరు సరి కదా.. తమకు ఎంతో మేలు జరుగుతోందని గొప్పగా చెప్తారు కూడా. ఇలాంటి వారిలో కాపు కుల పెద్దలని చెప్పుకునే వారితో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు.
Also Read : మేము మళ్లీ అధికారంలోకి వస్తే..!
ఏపీలో టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా కులాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే ఏకైక లక్ష్యం. ఇలాంటి వారిలో అగ్రస్థానంలో ఉండే నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి. కాపు సామాజిక వర్గాన్ని ఉద్దరించే నేతగా స్వయంగా ప్రకటించుకున్న ముద్రగడ.. కేవలం టీడీపీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతారు. కాపు కులానికి అనుకూలంగా మాట్లాడుతున్న ముసుగులో చంద్రబాబుపై విమర్శలు చేస్తారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం అని చెప్పి.. విధ్యంసానికి కారణమయ్యారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడం వెనుక ముద్రగడ రెచ్చగొట్టే వ్యాఖ్యలున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి మేథావులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. ఇక పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయగానే.. బ్రాహ్మణులపై చంద్రబాబు ఉక్కుపాదం అంటారు మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వీళ్లంతా టీడీపీపైన కూటమి ప్రభుత్వంపైన విమర్శలు చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.
Also Read : వివేకా కేసులో మరో నిందితుడ్ని లేపెయడానికి ప్లాన్..?
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కాపు సామాజికవర్గం. కాపులకు రిజర్వేషన్ ఇస్తామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చాడని ముద్రగడ పద్మనాభరెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో అంతా నిజమే అని నమ్మారు. అయితే నాటి చంద్రబాబు సర్కార్ కల్పించిన 5 శాతం రిజర్వేషన్ కూడా జగన్ ఎత్తేశారు. దీనిపై మహా మేధావులు ముద్రగడ పద్మనాభరెడ్డి, చేగొండి హరిరామ జోగయ్య వంటి నేతలు నోరు ఎత్తలేదు. పైగా 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కూడా. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఇప్పుడు సైలెంట్‌గా కుట్రలు చేస్తున్నారు.
Also Read : బోనాల బోనాంజ.. బీ అలర్ట్..!
కాపు సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని.. కాపులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఇటీవల వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తు్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 29న ఏపీలోని కాపు, బలిజ సామాజిక వర్గాలు సమావేశం కానున్నాయి. రిజర్వేషన్ల సాధనే ఏకైక ఆశయంతో కాపులంతా ఏకతాటిపైకి వచ్చేలా ఉద్యమించాలని ఇప్పటికే సైలెంట్‌గా మెసేజ్‌లు పంపుతున్నారు. తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని.. కనీస గుర్తింపు కూడా ఇవ్వటం లేదని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్‌కు మద్దతు ఇచ్చామని.. అయితే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు రాలేదంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కాపు నేత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే త్వరలోనే రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుందని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవానికి కాపు రిజర్వేషన్లు రద్దు చేసిన ఘనత మాత్రం వైఎస్ జగన్‌కు దక్కుతుంది. అయినా సరే.. జగన్ ప్రభుత్వంలో నోరు కూడా మెదపని కుల సంఘాల నేతలు.. ఇప్పుడు మాత్రం.. బయటకు వచ్చిన మాట్లాడుతున్నారు. ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే నేతల పట్ల కూటమి సర్కార్ కఠినంగా వ్యవహరించాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు. అలాగే ప్రజలు కూడా ఇలాంటి నేతల పట్ల అప్రమత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

