ఘోర పరాజయం తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. గతంలో ఎలాగైతే అధికారులను బెదిరించి పరిపాలన చేశారో.. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎలా అయితే ప్రజలకు అబద్ధాలు చెప్పారో.. ఇప్పుడు కూడా అలాగే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఏదో జరిగిపోతోంది అంటూ వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత వరకైనా సరే దిగజారిపోతున్నారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా ఒప్పు అయిపోయింది.. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తే మాత్రం తప్పు తప్పు అంటూ తెగ గగ్గొలు పెడుతున్నారు వైసీపీ నేతలు.
Also Read : వంశీ మరణం.. పేర్ని సంచలన కామెంట్స్
ఐదేళ్ల వైసీపీ పాలనలో చేయని అరాచకం లేదు. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేయడం వల్లే తీవ్ర మనస్థాపానికి గురైన మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాలు ఎన్నో వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగాయి. ఆపరేషన్ చేయించుకున్న రెండో రోజే ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును తెల్లవారుజామున గోడ దూకి మరీ ఇంట్లోకి వెళ్లి.. అరెస్టు చేశారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలోనే శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి గుంటూరు వరకు తీసుకువచ్చారు. దారి పొడవున రక్తం కారుతున్నా సరే.. ఏ మాత్రం జాలీ దయ చూపకుండా ఆయనను చంపేందుకు ప్రయత్నం చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. చివరికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించాలని కోర్టు సూచిస్తే.. అక్కడ కూడా ఆయనకు కరోనా వైరస్ సోకేలా కుట్ర చేశారు నాటి ప్రభుత్వ పెద్దలు.
Also Read : కవిత కోపానికి కారణం ఆయనేనా..?
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. వైసీపీ సర్కార్ చేసిన అకృత్యాలు లెక్క లేనన్ని. చివరికి మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లెస్ కేటగిరి రక్షణ ఉన్న చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఏకంగా 53 రోజుల పాటు జైలులో పెట్టింది. ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించమని కోర్టు ఆదేశించినా సరే.. వాటిని లెక్క చేయకుండా జైలులోనే హత్య చేయాలని ప్లాన్ చేశారు నాటి సర్కార్ పెద్దలు. కరుడుగట్టిన నేరస్తులు, మావోయిస్టులు ఉంటున్న బ్యారక్ సమీపంలోనే చంద్రబాబును కూడా ఉంచారు. చివరికి టాయిలెట్ కమోడ్ పక్కన ఉన్న పైప్ కూడా తీసేశారు. జైలులో చంద్రబాబు కదలికలపై నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది నాటి వైసీపీ సర్కార్.
Also Read : రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్.. టాలీవుడ్ పై పవన్ ఫైర్
అప్పుడు ఇవన్నీ వాళ్లకు కరెక్ట్. కానీ ఇప్పుడు అదే వైసీపీ నేతలు మాత్రం.. తప్పులు చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారు. వారి తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ.. కూటమి సర్కార్‌ను బెదిరిస్తున్నారు. రాష్ట్రం అలా అవుతుంది ఇలా అవుతుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. తాజాగా నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. తొలి నుంచి శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి జైలు జీవితం కొత్త కావడంతో ఆయనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.
Also Read : పసుపు పండుగ కోసం తెలుగు తమ్ముళ్లు రెడీ..!
తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువచ్చిన వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. వంశీ ఆరోగ్యం బాగాలేదని.. ప్రాణాలు పోతున్నా సరే.. వంశీకి ఓఆర్ఎస్ కూడా ఇవ్వటం లేదన్నారు నాని. గతంలో ఎన్టీఆర్ పతనానికి రంగా మరణం కారణమైందని వింత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వంశీకి ఏమైనా జరిగితే కూటమి ప్రభుత్వం పతనం అవుతుందని పేర్ని నాని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తుంటే.. దానిని దిక్కుమాలిన ఆసుపత్రి అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. వంశీకి ఏమైనా జరిగితే.. హింస జరుగుతుందని పరోక్షంగా హెచ్చరించారు పేర్ని నాని.




