గంజాయి రౌడీ మూక.. చివరికి రైతుల పాలిట యమగండంగా మారింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మదపుటేనుగుల మాదిరిగా తొక్కి నాశనం చేస్తే.. రైతుల కన్నీళ్లకు దిక్కెవరు. గిట్టుబాటు ధర లేదని ఒక్క రైతు కూడా చెప్పలేదు. కానీ రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు వైఎస్ జగన్. రాజకీయ ప్రయోజనాల కోసం ప్యాలెస్ నుంచి బయటకు వచ్చారు. ఇక అంతే.. సైకో బ్యాచ్ కూడా రంగంలోకి దిగింది. ఎక్కడున్నామనే కనీస స్పృహ కూడా లేకుండా.. వ్యవహరించారు గంజాయి రౌడీ మూక.
Also Read : తల్లికి వందనంపై గుడ్ న్యూస్.. పక్కా ప్లాన్ తో దిగుతున్న సర్కార్
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని.. పొగాకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించిన జగన్.. వారితో మాట్లాడారు. ఇంత వరకు బాగానే ఉంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలికాఫ్టర్‌లో పొదిలి చేరుకున్నారు జగన్. అయితే అధినేత పర్యటన కోసం ప్రకాశం జిల్లా నేతలు భారీగానే ప్లాన్ చేశారు. గతంలోనే ఓసారి పొదిలి పర్యటన రద్దు కావటంతో.. ఈసారి జనం వస్తారో రారో అనే అనుమానంతో.. గిద్దలూరు, యర్రగొండపాలెం, కందుకూరు, కనిగిరి, ఒంగోలు నియోజకవర్గాల నుంచి కూడా మనుషులను తరలించారు నేతలు.
ఇక ప్రతిసారి మాదిరిగానే జగన్ కనిపించగానే వైసీపీ సైకోలు సీఎం సీఎం అంటూ నినాదాలతో రెచ్చిపోయారు. అరే వచ్చిన పనేంటి.. చేస్తున్న నినాదాలు ఏమిటీ అనే కనీస స్పృహ కూడా ఈ గంజాయి బ్యాచ్‌లో లేకుండా పోయింది. జగన్‌ను పొగాకు కేంద్రం వరకు వెంబడించిన వైసీపీ కార్యకర్తలు.. పోలీసులు వారిస్తున్నా వేలం కేంద్రం లోపలికి చొరబడ్డారు. ఇక అంతే.. అక్కడ గంజాయి రౌడీ మూక చేసిన రచ్చ మామూలుగా లేదు. పొగాకు రైతుల పాలిట యమదూతలుగా వ్యవహరించారు. పాపం కష్టపడి పండించిన పొగాకును అచ్చోసిన ఆంబోతుల్లా ఎక్కి తొక్కేశారు. పైగా ఎక్కడున్నామనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అరుపులు కేకలు వేశారు.
Also Read : మరో వివాదంలో సింగర్ మంగ్లీ..!
పొగాకు పంటను పూర్తిగా ఆరబెట్టి, ఎండిన తర్వాతే కట్టలు కట్టి వేలం కేంద్రానికి తీసుకువస్తారు. వందల టన్నుల పొగాకు వేలం కేంద్రంలో ఉంది. అలాంటి చోట చిన్న నిప్పురవ్వ పడినా సరే.. మంటలు వెంటనే చెలరేగుతాయి. అందుకే పొగాకు వేలం కేంద్రంలో ధూమపానం నిషేధం. రైతులు కూడా వేలం కేంద్రం బయటే నిప్పు ఆర్పేస్తారు తప్ప.. పొరపాటున కూడా లోపలికి తీసుకురారు. కానీ వైసీపీ గంజాయి రౌడీ మూక మాత్రం.. నేరుగా పొగాకు వేలం కేంద్రంలోనే సిగరెట్లు తాగేసి కింద పడేశారు. అక్కడ అగ్నిప్రమాదం జరిగితే.. ఆ రైతుల కన్నీళ్లకు దిక్కు ఎవరు. పొగాకు పంట కాలిపోవడంతో పాటు.. అక్కడికి వచ్చిన వారు కూడా ప్రమాదంలో పడతారు. జగన్ ముఖ్యమంత్రిగా లేరు, కనీసం ప్రతిపక్క్ష నేత కూడా కాదు. పులివెందుల ఎమ్మెల్యేగా అన్నదాతలపై జాలి ఉండాలి కదా.
వాస్తవానికి పొదిలి వేలం కేంద్రంలో పొగాకు రైతులు లేరు.. మరి వీళ్ళు ఎవరు అంటే జగన్‌ను చూసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు. రైతులు కష్టపడి పండించిన పంటను ధ్వంసం చేసి, సిగ్గు లేకుండా ప్రభుత్వం పైనే బురద జల్లే ప్రయత్నం చేశారు జగన్. పొగాకు బేళ్ళను నాశనం చేసిన ఈ గంజాయి రౌడీ మూక పనులు చూస్తుంటే, అసలు వీళ్లు మనుషులు కాదని స్పష్టమవుతోంది. కళ్లుండి చూడలేని అంధత్వం, చేతులుండి పట్టుకోలేని చేతకానితనం.. ఇదంతా మత్తు ప్రభావమేనా.. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి అన్నదాతల నోట్లో మట్టి కొట్టడం ఎంతవరకు సమంజసం.
Also Read : అమరావతి రైతులపై దాడి చేయమన్నాడు.. బాంబు పేల్చిన కోటంరెడ్డి
జగన్ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి సాగు, డ్రగ్స్ వాడకం పెరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పార్టీ అనుచరుల రౌడీయిజం ఇలా గంజాయి వాసనతో రైతుల జీవితాలను తొక్కేస్తుంటే, దానికి ఎవరు బాధ్యులు. జగన్ పక్కనే ఉన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప.. రైతుల కన్నీరు మాత్రం తుడవలేదు.. సైకోలను నిలువరించలేదు. రైతులు కష్టపడి పండించిన పంటను అడవి పందులు నాశనం చేసినట్లుగా తొక్కేస్తుంటే.. కళ్ళ ముందు చూస్తూ కూడా ఆపకపోవడం ఎంత సిగ్గుచేటు. వీరికి రైతులంటే కనీస గౌరవం లేదా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. రైతులకు అండగా నిలబడతామని చెప్పి వచ్చి వాలిన ఈ మంద, ఇప్పుడు రైతుల పంటను నాశనం చేసింది.
ఈ విధ్వంసంతో ఆ పొగాకు బేళ్లు అమ్మేది ఎలాగో తెలియక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జగన్ రౌడీ మూకల విధ్వంసం మీద కేసులు నమోదు చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నాయకుల అరాచకాలను చూసిన ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా కూడా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. అందుకే జగన్ సొంత మీడియాలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై రాళ్ల దాడి చేశారు. జగన్ పర్యటన సమయంలో నల్లు బెలూన్లు ఎగుర వేసేందుకు యత్నించిన మహిళలపై చెప్పులు విసిరారు. ఆపేందుకు వచ్చిన పోలీసు తల పగలగొట్టారు. సైకో పాలన ముగిసి ఏడాది అయినా కూడా.. ఇంకా ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే.. కూటమి ప్రభుత్వ తీరుకే పెన సవాల్.




