Saturday, September 13, 2025 12:39 PM
Saturday, September 13, 2025 12:39 PM
roots

ప్యాలెస్ లో ఉన్న దొంగను బయటకి లాగండి

గత ప్రభుత్వ అవినీతి, అక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్న మాజీ గనుల శాఖ అధికారి వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేసారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు… పెద్ద డొంకలు కూడా కదలాలని ఆమె డిమాండ్ చేసారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాలని కోరారు షర్మిల.

అదే విధంగా రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే… తెర వెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు షర్మిల. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు అని మండిపడ్డారు. టెండర్లు, ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు అని తీవ్ర ఆరోపణలు చేసారు.

Read Also : భార్య ఎంట్రీతో జానీ మాస్టర్ కేసులో కీలక ట్విస్ట్

ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) నిభందలను తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని కోరారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి సర్కార్ ను డిమాండ్ చేస్తున్నాం అన్నారు. సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణను కోరండి అంటూ డిమాండ్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

పోల్స్