Wednesday, February 4, 2026 02:00 PM
Wednesday, February 4, 2026 02:00 PM

అంతా నా ఇష్టం అంటున్న జగన్

సాధారణంగా చట్టం ముందు ఎవరైనా సమానమే. కోర్టు పని ఉంది అంటే.. వాళ్లు ఏ స్థాయి వాళ్లు అయినా సరే.. న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇక వాళ్లకు ఎంత సమయం పడుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అయితే న్యాయమూర్తి ఎప్పుడు పిలుస్తారో తెలియదు.. ఎంత సేపు విచారిస్తారో తెలియదు.. కాబట్టి.. కోర్టు పని అంటే చాలు.. ఆ రోజు మరే ఇతర పనులు పెట్టుకోరు. ఉదయమే తన తరఫు న్యాయవాదితో సంప్రదింపులు జరిపి.. కోర్టు సమయానికి కోర్టుకు వచ్చేస్తారు. తన హియరింగ్ వచ్చే వరకు కోర్టు హాల్‌ బయట ఎదురు చూడాల్సిందే. కోర్డు బంట్రోతు పేరు పిలిచిన వెంటనే.. న్యాయమూర్తి ఎదురుగా హాజరవ్వాల్సిందే. అక్కడ కేసు విచారణ జరుగుతున్నంత సేపు బోన్‌లో నిలబడాల్సిందే. కొన్ని సందర్భాల్లో అయితే.. ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలు వినిపించే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ ప్రక్రియ ఎవరికైనా ఒకటే. కానీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఇదంతా వేరనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

Also Read : బీజేపి చీఫ్ ఆయనే..? కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు..!

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 16 నెలల పాటు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలయ్యారు. నాటి ప్రతి శుక్రవారం కోర్టు వాయిదాలకు వెళ్తూనే ఉన్నారు. చివరికి ముఖ్యమంత్రి హోదాలో కూడా 2020లో చివరి సారి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదాకు హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి భద్రతా కారణాలు, ప్రభుత్వానికి ఖర్చు అననే సాకులతో వాయిదాలకు రాకుండా కోర్టు అనుమతి పొందారు. అయితే దాదాపు 13 ఏళ్లుగా అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతోందని.. ఈ కేసును సాధ్యమైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఇక జగన్ యూకే పర్యటన సమయంలో ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చారని సీబీఐ న్యాయవాది కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్‌ నేరుగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో.. ఈ నెల 20న కోర్టుకు వస్తున్నట్లు జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Also Read : సొంత పార్టీ నేతలపై జగన్ ఫైర్..!

జగన్ హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ముందు ఈ నెల 20న హాజరవుతున్నట్లు అధికారికంగా వైసీపీ నేతలు ప్రకటించారు. జగన్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఇక్కడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉదయం 9 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరం బయలుదేరుతారు. 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11.30 గంటలకు నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సరిగ్గా 12.30 గంటలకు బయలు దేరి లోటస్ పాండ్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి.. తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 3.10 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. దీంతో సరిగ్గా గంట పాటు మాత్రమే నాంపల్లి సీబీఐ కోర్టులో ఉంటా అని జగన్ తన న్యాయవాదులకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. దేశంలో తొలిసారి కోర్టుకు సమయం ఇచ్చినట్లుందనే మాట బాగా వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే టిఫిన్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో, భోజనం లోటస్ పాండ్‌ ప్యాలెస్‌లో, డిన్నర్‌ ఎలహంక ప్యాలెస్‌లోనా అని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్