Sunday, March 22, 2026 01:14 PM
Sunday, March 22, 2026 01:14 PM

బాగా బ్యాడ్ అయ్యా…కాస్త సరిచేయండి

  • తనపై ఉన్న మరకల్ని తుడిపేసుకునేందుకు రూ.65 కోట్లతో డీల్
  • కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన ఓ ప్రైవేట్ సంస్థతో జగన్ ఒప్పందం
  • తన క్యారెక్టర్‌ను మరింత ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో జగన్

ఘోర తప్పిదాలు, అస్తవ్యస్థ పాలన, అవినీతి, అరాచకాలతో అధికారం నుంచి కుప్పకూలిన వైసీపీ అధినేత జగన్ మెల్లగా మళ్లీ లేచి నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వకుండా జగన్‌ను ప్రజలు పాతాళానికి తొక్కారు. దీనికి తోడు తల్లీ, చెల్లిని ఆస్తుల విషయంలో కోర్టుకు ఈడ్చి తన బుద్ధి ఏంటనేది సమాజానికి తెలియజేసుకున్నారు జగన్. తన వ్యక్తిత్వ వైఖరితో జగన్ ప్రజల్లో పలచబడ్డారు. అయితే తన సొంత పత్రిక సాక్షి ద్వారా ఎంత ప్రమోట్ చేసినా ప్రజల్లో నమ్మకం పొందలేకపోతున్నారు. దీంతో ఎలాగైనా మళ్లీ తాను సౌమ్యుడు, మంచివాడు, దయాప్రీతి కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Also Read : మాట తప్పాడు.. మడమ తిప్పాడు..!

ఇందుకోసం భారీగానే జగన్ ఖర్చు చేయనున్నారు. తనపై ఉన్న అవినీతి, అక్రమాలు, నెత్తుటి మరకలు చెరిపేయించుకునేలా ప్రచారం చేసేందుకు ఏకంగా రూ.65 కోట్లు కేటాయించుకున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ఓ పొలిటికల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జగన్… దీనికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయించారు. దీని ప్రకారం జగన్ మంచి వ్యక్తి అని, హత్యలను ప్రోత్సహించరని, వెన్న మనసు కలిగిన వ్యక్తిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం గతంలో ప్రమోట్ కోసం తీసిని ఫోటోలు, వీడియోలు, మాటలను బయటకు తీసి విస్తృత ప్రచారం చేసేందుకు ప్లాన్ వేస్తున్నారట.

Also Read: ఇప్పుడేం వద్దు.. చంద్రబాబు, పవన్ కీలక నిర్ణయం..?

ఇలా చేస్తే కనీసం కొంతలో కొంతైనా తన పట్ల ప్రజల్లో సానుకూల భావం ఏర్పడుతుందన్న ఆశాభావంలో జగన్ ఉన్నారని టాక్. తల్లి విజయమ్మ, చెల్లి శర్మిల ఆస్తుల అంశంతో పాటు వివేకా హత్యపై పోరాడుతున్న సునీతారెడ్డి అంశాలు జగన్ వ్యక్తిత్వానికి బాగా గండికొట్టాయి. అవసరమైతే వీటిపై తనకు కలిసొచ్చేలా తప్పుడు ప్రచారం చేయించే పనిలో ఉన్నారు. వీటన్నింటిపై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కొందరు స్వయంప్రకటిత మేధావులతో జగన్ మంచివాడు, ఆహా, ఓహో అనే విధంగా పొగడ్తల వర్షం కురిపిస్తారు. అయితే ఈ మొత్తానికి సంబంధించిన డీల్ కొన్ని రోజుల క్రితమే యలహంక ప్యాలెస్ వేదికగా జరిగిందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్