Wednesday, March 25, 2026 07:04 AM
Wednesday, March 25, 2026 07:04 AM

కుల చిచ్చు కోసం కొత్త డ్రామా..?

రాజకీయాల్లో కులాలు మతాలు అనేవి ఈ రోజుల్లో సహజమే. దశాబ్దాలుగా ఈ కుల, మత, ప్రాంత చిచ్చు రాజకీయాలను శాసిస్తున్నా.. నేటి రాజకీయ ముఖ చిత్రంలో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాల తీవ్రత ఎక్కువ. 80 ల నాటి నుంచి ఈ వేడి.. కోస్తాంధ్రను తాకుతూనే ఉంది. దీనిని వాడుకునే విషయంలో వైఎస్ కుటుంబం సక్సెస్ అవుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి కుల రగడను రగిల్చేందుకు ఏపీలో వైసీపీ సిద్దమైంది.

Also Read : సిగ్గు సిగ్గు.. జగన్‌ పరామర్శకు ఇవేనా అర్హతలు..?

2014 నుంచి 19 వరకు ముద్రగడను అడ్డం పెట్టుకుని డ్రామా ఆడితే.. ఇప్పుడు అంబటిని అడ్డం పెట్టుకుని ఆడుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. బూతులు మాట్లాడిన అంబటికి జేజేలు కొట్టిన జగన్.. ఉత్తరాంధ్ర నుంచి కాపు నేతలను ర్యాలీగా గుంటూరు గడ్డకు రావాలని ఆదేశించారు. మరో మాజీ మంత్రి, కాపు నేత గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో కాపు నేతలు అందరూ కార్లు వేసుకుని గుంటూరు చేరుకున్నారు. ఇక రంగా వారసుడు అంటూ వారం పది రోజుల నుంచి కేజిఎఫ్ రేంజ్ ఎలివేషన్ లు కనపడుతున్నాయి.

Also Read : పాకిస్థాన్‌ లోనూ ‘ధురంధర్’ విధ్వంసం

ఇక కాపు నేతలను రంగంలోకి దించి.. వారితో నిరసనలు చేయించే దిశగా, ఆమరణ దీక్షలు ఏర్పాటు చేయించే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయనే మాట వినపడుతోంది. జనసేనను కూటమి నుంచి వేరు చేయడం సాధ్యం కాదనే భావనలో ఉన్న జగన్.. ఇప్పుడు అంబటి రూపంలో వచ్చిన అవకాశాన్ని వాడుకుని కాపులను కూటమికి దూరం చేసే ప్లాన్ మొదలుపెట్టారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపుల ఎమోషన్ ను వాడుకుని, తన అధికార కాంక్షను మరోసారి నెరవేర్చుకోవాలని జగన్ వర్గం వేస్తున్న అడుగుల చప్పుడు.. రాష్ట్రంలో తీవ్రంగా మార్మోగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్