Sunday, March 22, 2026 09:48 AM
Sunday, March 22, 2026 09:48 AM

ఫలించని కూతురు రాయభారం!

కుటుంబంతో రాజీ చేసుకునేందుకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. 2019 ఎన్నికలకు ముందు కుటుంబ సభ్యులంతా కలిసి వైసీపీ గెలుపు కోసం పని చేశారు. అయితే సీఎం అయిన తర్వాత కుటుంబాన్ని జగన్ దూరం పెట్టారు. చివరికి ఆస్తి కోసం సొంత చెల్లెలిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో 2024 ఎన్నికల్లో సొంత అన్న జగన్‌పైనే చెల్లెలు వైఎస్ షర్మిల యుద్ధం ప్రకటించారు. చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా జగన్‌ను కాదని… కుమార్తె షర్మిలకే ఓటు వేసి గెలిపించాలంటూ బహిరంగ లేఖ రాశారు. దీంతో జగన్ పరువు పోయింది.

Also Read: వైసీపీ.. మరీ ఇంత దారుణమా..!

ఇక ఎన్నికల తర్వాత ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరుకుంది. చెల్లెలుపై కోర్టులో పిటిషన్ వేయడం… దీనిని తల్లి విజయలక్ష్మి సైతం తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికలకు ముందే షర్మిల కొడుకు దగ్గరకు అమెరికా వెళ్లిపోయిన విజయలక్ష్మి… కేసుల విషయం బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జగన్‌ను కలవలేదు. చివరికి వైఎస్ఆర్ వర్థంతి, జయంతి కార్యక్రమాల్లో కూడా ఈ ఇద్దరు ఎక్కడా కలవలేదు. షర్మిలతో కలిసి ఇడుపులపాయ ఘాట్‌కు వచ్చి నివాళి అర్పించి వెళ్లిపోయారు. అంతే తప్ప జగన్‌ను కలవలేదు. కన్న తల్లినే సరిగ్గా చూడటం లేదనే అపవాదు జగన్‌కు మరింత చెడ్డపేరు తీసుకువచ్చింది.

Also Read: రాజీకి సిద్దం.. రేవంత్ ఇంటికి సినిమా పెద్దలు…!

దీంతో జగన్‌కు దూరంగా ఉంటున్న విజయలక్ష్మితో రాజీ చేసుకుంటేనే భవిష్యత్తులో పార్టీకి మేలు జరుగుతుందనే సలహా వైసీపీలో కొందరు పెద్దలు ఇవ్వటంతో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు జగన్. ఈ ఏడాది సెప్టెంబర్ ‌నెలలోనే లండన్ వెళ్లేందుకు జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పాస్‌పోర్టు కావాలంటే కోర్టుకు వెళ్లాలనే భయంతో జగన్ లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరు ప్యాలెస్‌కు షిఫ్ట్ అవ్వగా… విజయలక్ష్మి హైదరాబాద్ లోటస్‌పాండ్ ప్యాలెస్‌లో ఉంటున్నారు.

Also Read: కేటిఆర్ పక్కాగా బుక్ అయ్యాడు.. ఏసీబీ సంచలన అడుగులు

జగన్ పుట్టినరోజు కోసం స్వదేశానికి వచ్చిన ఆయన కుమార్తె… తల్లికొడుకు మధ్య రాజీకి యత్నించినట్లు తెలుస్తోంది. జగన్ పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందే బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న జగన్ పెద్ద కుమార్తె… నాన్నమ్మను బుజ్జగించి బెంగళూరు తీసుకెళ్లేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. పాత గొడవలన్నీ పక్కన పెట్టి అంతా కలిసుందామంటూ మేనత్త షర్మిలను కూడా కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మనవరాలి విజ్ఞప్తిని నానమ్మ విజయలక్ష్మి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అటు షర్మిల కూడా అన్న జగన్‌ను కలిసేది లేదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: తెలుగుదేశం.. పడిలేచిన కెరటం..!

“మేనకొడలుగా నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చని… అయితే మీ నాన్నతో మాత్రమే కలిసేది లేదు” అని తేల్చి చెప్పినట్లు సమాచారం. పుట్టినరోజు కోసం బెంగళూరు వచ్చేది లేదని… కావాలంటే ఇడుపులపాయలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో వచ్చి కలుస్తామని విజయలక్ష్మి మనవరాలికి సర్దిచెప్పినట్లు లోటస్‌పాండ్ సమాచారం. దీంతో చేసేది లేక… సైలెంట్‌గా జగన్ పెద్ద కుమార్తె బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో రాజీ ప్రయత్నాలు ఫలించే మార్గం లేదనేది ఇప్పుడు వైసీపీ సీనియర్ నేతల్లో కలవరం రేపుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్