వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారుతున్నారా.. ఆయనలో మార్పు వస్తుందా.. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు వరకు ” నా వెంట్రుక కూడా పీకలేరు” అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్.. ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు మాత్రమే రావడంతో.. తన ముఖం చూపించలేక సైలెంట్‌గా బెంగళూరు వెళ్లిపోయారు. సీఎంగా ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న సమయంలో తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన జగన్.. ఎన్నికల తర్వాత బెంగళూరు ప్యాలెస్‌కు షిఫ్ట్ అయ్యారు. రెండు సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైఎస్ జగన్.. సరిగ్గా 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఆ తర్వాత కామ్‌గా సభ నుంచి వాకౌట్ చేసి.. మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ గగ్గొలు పెడుతున్నారు జగన్.
Also Read : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
వైఎస్ జగన్ తీరుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఓడినా, గెలిచినా కూడా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్న వాడే అసలైన నాయకుడు అనేది రాజకీయాల్లో రుజువైన మాట. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. అందుకే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి ఇప్పటికీ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఎన్ని అవమానాలు ఎదురైనా కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ జెండా మోస్తూనే ఉన్నారు. కానీ జగన్ విషయంలో మాత్రం అది జరగలేదు. అధికారంలోకి వచ్చేందుకు ముద్దులు పెట్టిన జగన్.. ఐదేళ్ల పాటు కనీసం పార్టీ ముఖ్య నేతలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో జగన్ తీరుపై పార్టీ నేతలు, కార్యకర్తలే విమర్శలు చేస్తున్నారు.
Also Read : ఢిల్లీలో చంద్రబాబు, పవన్ రాజకీయం..!
ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వలేదనే సాకుతో ఏపీ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు జగన్. అయితే పరిస్థితి ఇలాగే ఉంటే.. రాబోయే రోజుల్లో పార్టీ మనుగడే కష్టంగా మారుతుందని ముఖ్యనేతలు ఇచ్చిన సలహా మేరకు కొత్త ప్లాన్ వేశారు. గతంలో పాదయాత్ర నిర్వహించిన జగన్.. ఇప్పుడు లోకేష్ ప్రజాదర్బార్ తరహాలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కార్యాచరణ సిద్ధం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ భారీగా వస్తారనే అంచనాతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ సెల్‌లో జగన్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తారా.. లేక పార్టీ తరఫున నేతలే అర్జీలు తీసుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది. అలాగే ఈ ఫిర్యాదుల స్వీకరణ అనేది ప్రతి రోజు ఉంటుందా.. లేక నెలకో రోజుతో సరిపెడతారో కూడా తెలియదంటున్నారు పార్టీ నేతలు.
Also Read : పట్టువదలని పూరి.. ఫాం కోసం తంటాలు
అయితే ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు, లోకేష్ కూడా ఇదే తరహాలో ఫిర్యాదులు స్వీకరించారు. అయితే వారిద్దరు ఆయా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేశారు. సమస్యలపై అసెంబ్లీలో, మండలిలో ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా. కానీ జగన్ మాత్రం.. కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదు. మరి ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారు.. ఎక్కడ ప్రస్తావిస్తారంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నిటికీ జవాబు రావాలంటే.. ముందు వైసీపీ గ్రీవెన్స్ ప్రారంభం అవ్వాలి కదా అనే మాట కూడా వినిపిస్తోంది.

