వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై అసభ్య పదజాలంతో బూతులతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేయగా.. రాంబాబు మంచోడని, అమాయకుడని, అసలు నోట్లో వేలు పెట్టినా కొరకలేడంటూ అంబటికి జగన్ క్లీన్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే.. అసలు అంబటి నోట బూతులే రావన్నారు కూడా. ఆయన తప్పే లేదని.. తప్పంతా తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి సర్కార్‌దే అని వింత మాటలు చెప్పారు. పదే పదే జంగిల్ రాజ్ అని చెప్పిన జగన్.. తన పాలనలో జరిగిన ఘటనలను మాత్రం మర్చిపోయినట్లున్నారు.
Also Read : ప్రియాంక రిక్వస్ట్ తో మహేష్, రాజమౌళి షాక్ అయ్యారా..?
తిరుమల శ్రీవారీ లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు సిట్ నివేదిక సమర్పిస్తే.. అసలు సిట్ నివేదికలో కల్తీ అనే మాటే లేదన్నట్లుగా జగన్ వింత వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదికలో ఫిష్ ఆయిల్, జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా ఉందని బుకాయించే ప్రయత్నం చేశారు. నివేదికలో 209, 210 పేజీల్లో ఫిష్ ఆయిల్ అనే మాట స్పష్టంగా ఉన్నప్పటికీ.. జగన్ మాత్రం.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేశారు. ఇక అంబటి పై దాడిని ప్రస్తావించిన జగన్.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. మాజీ మంత్రులు అంబటి, పేర్ని నాని, విడదల రజిని, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు బోల్లా బ్రహ్మనాయుడు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇళ్లపై జరిగినవి జంగిల్ రాజ్‌కు నిదర్శనమన్నారు. అయితే తన పాలనలో టీడీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు మాత్రం జగన్ జవాబు చెప్పలేదు.
Also Read : గుంటూరు కారమా.. మజాకానా…!
ఓ వైపు బూతులతో రెచ్చిపోయిన అంబటి.. ఆ వీడియో బయటకు రావడంతో.. తాను తప్పు చేసినట్లు స్వయంగా ప్రకటించారు. అయితే అంబటి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మాత్రం.. అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని ప్రశ్నించటం అక్కడున్న వైసీపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు నెయ్యిలో ఎలాంటి కొవ్వు లేదని ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా ఉన్నా.. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు సహా కూటమి నేతలు తప్పుడు ప్రచారంతో ఫ్లెక్సీలు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు జగన్. అదే సమయంలో సీబీఐ చార్జ్‌షీట్‌లో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని.. తప్పు చేసినట్లు ఆధారాలుంటే వీళ్లని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు జగన్. అంటే వైవీ, భూమనను వెంటనే అరెస్టు చేయాలని జగన్ డిమాండ్ చేస్తున్నారా.. అనే మాట బాగా వినిపిస్తోంది. ఓ వైపు కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలో స్పష్టంగా ఉంటే.. జగన్ మాత్రం.. సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్స్ క్లీన్ చిట్ ఇచ్చాయని పదే పదే చెప్పటం అబద్ధాన్ని నిజం చేసేందుకు చేసిన ప్రయత్నంలా ఉంది.

