వైఎస్ జగన్ అంటే మాట తప్పడు… మడమ తిప్పడు అనే మాట గుర్తుకు వస్తుంది. అలాగే నేను విన్నాను… నేనున్నాను… అనే మాట కూడా. ఇక పదేపదే చెప్పే మాట… మోసం చేయడం నాకు తెలియదు అంటాడు కూడా. అయితే రెండు రోజులుగా జగన్ వ్యవహారంపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత కుటుంబ వ్యవహారమే అందుకు కారణం కూడా. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సర్వ సాధారణం. అయితే జగన్ రాజకీయ ప్రయాణం మొత్తం కూడా అబద్ధాల మీదే గడిచింది అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ ఆరోపణకు కావాల్సినన్ని రుజువులు కూడా చూపిస్తున్నారు. వైసీపీ డబుల్ స్టాండ్ అని కూడా ఆరోపిస్తున్నారు.
Also Read: కాపీ స్క్రిప్ట్ తో వైసీపీ నాయకులు.. అరెస్ట్ భయమే కారణమా?
జగన్, షర్మిల మధ్య ఉన్న వివాదం పూర్తిగా కుటుంబ వ్యవహారమే అంటున్నారు టీడీపీ నేతలు. జగన్ కూడా కుటుంబ వ్యవహారమే అనేశారు. అలాగే మీ కుటుంబాల్లో ఇలాంటి వివాదాలు లేవా అని ప్రశ్నించారు. హర్ ఘర్ కీ కహానీ అని కూడా అనేశారు. అయితే ఇదే సమయంలో షర్మిలను చంద్రబాబు వదిలిన బాణం అంటున్నారు. టీడీపీ చెప్పినట్లు షర్మిల ఆడుతున్నారని కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. అదేంటంటే… షర్మిల రాసిన లేఖను సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది అంటున్నారు. కుటుంబ వ్యవహారంలోకి, వివాదంలోకి చంద్రబాబు ఎలా వస్తారు.. ఎప్పుడు వచ్చారు… ఇద్దరు కలుసుకున్నట్లు ఏవైనా రుజువులున్నాయా అంటే… నో ఆన్సర్.

అసలు షర్మిలకు ఆస్తి ఇచ్చేది లేదని మొదట లేఖ రాసింది ఎవరు అనేది టీడీపీ నేతల ప్రశ్న. కుటుంబ వ్యవహారం అంటున్న జగన్… చంద్రబాబు కుట్ర అంటున్నారు… దీనికి టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తే… మీకేంటి సంబంధం అంటున్నారు… ఇదేం లాజిక్ జగన్ అంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఎన్నికలకు ముందు ఎల్లో మీడియా అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అదే సమయంలో తనకు ఎలాంటి పత్రిక, మీడియా లేదని కూడా చెప్పారు. ఆ సమయంలో సాక్షి మీడియా ఎవరిదీ అనే ప్రశ్న కూడా తలెత్తింది. సాక్షి ఛైర్మన్ భారతీ రెడ్డితో మీరు విడాకులు తీసుకున్నారా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు కూడా వచ్చాయి.
Also Read: షర్మిలతో పోరాటం అంటే.. జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా?
అయితే తాజాగా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. జగతి పబ్లికేషన్‌ను జగన్ స్థాపించారన్నారు. జగన్, భారతీ పేర్లు కలిసి వచ్చేలా జగతి అనే పేరు పెట్టారని కూడా వైవీ సుబ్బారెడ్డి క్లియర్‌గా చెప్పారు. అసలు మీడియా లేదని జగన్ పచ్చి అబద్ధం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరో వింత వాదన కూడా జగన్ చేస్తున్నారు. ఆస్తుల పంపకం వివాదంలో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను పంచితే బెయిల్ రద్దు చేస్తారని షర్మిలకు రాసిన లేఖలో ప్రస్తావించారు. అయితే ఇది పూర్తి తప్పుడు వాదన అంటున్నారు. బెయిల్ రద్దుకు, ఆస్తుల పంపకానికి ఏమిటి సంబంధం అంటున్నారు. ఇదే విషయాన్ని షర్మిల కూడా ప్రశ్నిస్తున్నారు.
Also Read: మంత్రులూ ఎందుకీ మౌనం..? చంద్రబాబు ఆవేదన..!
ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది తప్పితే… బెయిల్ రద్దు చేయదంటున్నారు. మరోవైపు గత ఐదేళ్లు జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ నుంచి విడుదల చేసేసినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు కూడా. ఆస్తులన్నీ బయటకు వచ్చాయని కూడా చెప్పారు. అయితే తాజాగా షర్మిలకు జగన్ రాసిన లేఖలో ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్ విషయంలో ఉన్నట్లు ప్రస్తావించారు. ఇదేంటి అని ప్రశ్నిస్తున్నారు. అలాగే కుటుంబ వ్యవహారం అంటున్న జగన్… చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాల గురించి పదేపదే ఎందుకు మాట్లాడారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్ మాటలన్నీ అబద్ధాలే అంటున్నారు.

