Wednesday, October 22, 2025 10:50 PM
Wednesday, October 22, 2025 10:50 PM
roots

మీది రెడ్ బుక్… మాది యాప్..!

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లియర్ చేశారు. మరో మూడేళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తా అంటూ ఇప్పటికే మాస్ వార్నింగ్ ఇస్తున్నారు వైఎస్ జగన్. అలాగే వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను బట్టలూడదీసి నిలబెడతాం అంటూ భీష్మ ప్రతిజ్ఞలు కూడా చేశారు జగన్. తప్పు చేసిన వారిని వదిలేది లేదంటూ పదే పదే చెబుతున్న జగన్.. అధికారంలోకి వస్తే మాత్రం.. ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదు.. విపక్షాల మీద మాత్రం కక్ష తీర్చుకోవడం ఖాయమంటున్నారు వైఎస్ జగన్.

Also Read : టీడీపీ బాటలోనే జగన్..!

30 ఏళ్ల పాటు నేనే సీఎం.. అధికారంలోనే ఉంటా.. అంటూ విర్రవీగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు 151 వచ్చాయి.. గట్టిగా కృషి చేస్తే.. మిగిలిన సీట్లు కూడా మనమే గెలుస్తామన్నారు. వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి అన్నారు. చివరికి వై జగన్ అని ప్రజలు తీర్పు ఇవ్వడంతో.. ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో.. సైలెంట్‌గా సైడ్ అయ్యారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అరాచకాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వారిపై కేసులు పెట్టారు. వాళ్లంతా ఇప్పుడు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇదే తప్పు అంటున్నారు వైఎస్ జగన్. తప్పు చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటున్నారు. అలా చేయడం కక్ష సాధింపు కింద వస్తుందంటున్నారు.

యువగళం పాదయాత్ర సమయంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గురించి పదే పదే ప్రస్తావించారు. తప్పు చేసిన ప్రతి వైసీపీ నేత గురించి తన రెడ్ బుక్‌లో రాసుకుంటున్నట్లు తెలిపారు. వారు ఏ స్థాయిలో ఉన్న సరే.. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపైనే వైసీపీ నేతలు ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ కేసు పెట్టినా సరే.. అది రెడ్ బుక్ ప్రకారమే జరుగుతోందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిని సమర్థవంతంగా తిప్పి కొడతామని చెబుతున్నారు. కేసులు పెడితే పెట్టుకోండి… మాకేమన్నా భయమా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ రెడ్ బుక్ పైనే అధినేత జగన్ కూడా పదే పదే వ్యాఖ్యలు చేశారు. బహిరంగ వేదికపైన, మీడియా మీట్‌లో కూడా రెడ్ బుక్ గురించే జగన్ ప్రస్తావిస్తున్నారు.

Also Read : టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం..

వైసీపీ నేతలు, కార్యకర్తలు అన్యాయానికి, వేధింపులకు గురవుతున్నారని.. టార్గెట్ వైసీపీ అన్నట్లుగా పరిపాలన కొనసాగుతోందన్నారు జగన్. లేని మద్యం స్కామ్‌లో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిని అరెస్టు చేశారని.. ఇలాంటి అక్రమ అరెస్టులకు తప్పకుండా బదులు తీర్చుకుంటామనేది జగన్ మాట. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం.. చంద్రబాబు ఏదైతే నాటారో అదే చెట్టవుతుంది. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు జగన్. లిక్కర్ స్కామ్‌లో వరుస అరెస్టుల నేపథ్యంలో రెండు వారాల తర్వాత బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్.. పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు.

మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌కు కౌంటర్‌గా ఇప్పుడు డిజిటల్ ఉద్యమానికి జగన్ తెర లేపారు. త్వరలోనే పార్టీ తరఫున యాప్ విడుదల చేస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా సరే.. అన్యాయం జరిగినా.. తప్పు జరిగినా.. ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయండి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి బాధ్యులకు సినిమా చూపించడం ఖాయం అని ప్రకటించారు జగన్.

Also Read : చంద్రబాబు సింగపూర్ టూర్ సక్సెస్.. ఏపీకి రానున్న కంపెనీలు ఇవే..?

పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పదే పదే చెప్తున్న జగన్.. ప్రజలకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని మాత్రం అనటం లేదు. అంటే.. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు… కేవలం వైసీపీ కార్యకర్తలే ఇబ్బందులు పడుతున్నారనే మాటే అంటున్నారు జగన్. ఇదే విషయాన్ని కూటమి పార్టీల నేతలు కూడా చెబుతున్నారు. ప్రభుత్వ పనితీరులో ఎలాంటి లోటు లేదని జగన్ చెప్పకనే చెబుతున్నారని.. కేవలం తప్పుడు కేసులంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్నారు తప్ప.. పరిపాలనపై ఎలాంటి విమర్శలు చేయటం లేదంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ సొంత పార్టీ నేతలు కూడా తప్పుబడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

పోల్స్