Thursday, February 5, 2026 02:40 AM
Thursday, February 5, 2026 02:40 AM

క్రెడిట్ చోరీ స్కీమ్.. అయ్యో జగన్..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన చూస్తుంటే.. నిజంగానే జాలేస్తుంది. చేసిన మంచి పనులను చెప్పుకోలేకపోయామంటూ ఈ మధ్య మీడియా సమావేశంలో జగన్ వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా.. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఏ చిన్న ప్రకటన చేసినా సరే.. ఆ ఘనత తమకే దక్కుతుందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో పేదలకు సొంతింటి కలను చంద్రబాబు నెరవేరిస్తే.. ఆ ఘనత కూడా తనకే దక్కుతుందని సోషల్ మీడియా వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరో అడుగు ముందుకు వేసిన జగన్.. కూటమి సర్కార్‌లో క్రెడిట్ చోరీ స్కీమ్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతలనే ఇరుకున పెడుతున్నాయి. చంద్రబాబు చేయని మంచి పని కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నారని వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఘాటుగా తిప్పి కొడుతున్నారు. దీనికి సంబంధించిన రుజువులు కూడా చూపిస్తున్నారు.

Also Read : ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తో క్యాన్సర్ ముప్పు..?

2019-2024 మధ్య ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది అనేది కూటమి నేతలు చేసిన ఆరోపణలు. అభివృద్ధి చేయకపోగా.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ చేసుకున్న సంస్థలను కూడా తరిమేశారనేది కూటమి నేతల మాట. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నారు. చివరికి రాజకీయ వేధింపులతో చిత్తూరు జిల్లాలో పరిశ్రమ విస్తరణకు సిద్ధమైన మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమర్ రాజా సంస్థను బెదిరించారు. దీంతో ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకంగా 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త పరిశ్రమ ప్రారంభించారు. ఇక అనంతపురం జిల్లాలోని కియా సంస్థను హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అందరి ముందే బెదిరించారు. దీంతో.. అనుబంధ పరిశ్రమలను తమిళనాడులో ప్రారంభించింది కియా యాజమాన్యం. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి కూడా పోయింది.

కియా సంస్థ అంటే అది చంద్రబాబు వల్లే ఏపీకి వచ్చిందని ప్రతి ఒక్కరికీ తెలుసు. అసలు కియాకు శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కియా వల్ల ఆదాయం, ఉద్యోగాలు వస్తాయనే భావనతో ఎన్నో రాయితీలు కల్పించారు. అటు కియా యాజమాన్యం కూడా చంద్రబాబుకు ధన్యవాదాలు అంటూ లేఖ కూడా విడుదల చేసింది. అయినా సరే.. కియా సంస్థ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చిందంటూ అసెంబ్లీలోనే నాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిసిగ్గుగా మాట్లాడారు. మరి 2008లో ఎంఓయూ చేసుకున్న కంపెనీ 2015 వరకు ఎందుకు భూమి పూజ చేయలేదని అడిగిన ప్రశ్నకు వైసీపీ నేతలు జవాబు చెప్పలేకపోయారు.

తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ప్రభుత్వం తరఫున ఇస్తున్న భరోసా, రాయితీలు. దీంతో గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుని వెనకడుగు వేసిన సంస్థలు కూడా ఇప్పుడు మళ్లీ ఏపీ వైపు వస్తున్నాయి. గూగుల్ సంస్థ లక్షన్నర కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోంది. తాజాగా రీ న్యూ సంస్థ 82 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ నేతలు.. గూగుల్ సంస్థ పెట్టుబడులకు జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలే కారణమని.. రీ న్యూ సంస్థ కూడా విశాఖలో 2023లో జరిగిన పెట్టుబడుల సదస్సులోనే 97 వేల 500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. అసలు ఏపీకి వచ్చే ప్రతి కంపెనీ కూడా 2023లో వైసీపీ హయాంలో 12 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చుసుకున్నవే.. అందులో చాలా వరకు మొదలయ్యాయి.. అంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. దీనికి టీడీపీ నేతలు ఘాటుగానే బదులిస్తున్నారు.

Also Read : మాగంటి కోట కూలింది.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం..!

విశాఖపట్నంలో 3 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు పెడుతున్నట్లు రీ న్యూ సంస్థ 2018 అక్టోబర్ 22న అధికారికంగా ప్రకటించింది. ఇది భారత్‌లోనే అతి పెద్ద ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్టు అని కూడా ప్రకటించింది. టీడీపీ నేతలు నాటి అధికారిక ప్రకటనను బయట పెట్టారు. 2018లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రీ న్యూ సంస్థ.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక పెట్టుబడులు పెట్టలేదు. మళ్లీ మంత్రి నారా లోకేష్ రీ న్యూ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి.. భరోసా కల్పించడంతో.. మరోసారి 82 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుక వచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు వెల్లడించడంతో.. వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. దీంతో క్రెడిట్ చోరీ స్కీమ్ ఎవరిదో తెలుసు కదా అని ఎద్దేవా చేస్తున్నారు. ఐదేళ్లలో కనీసం ఒక్క ఇల్లు కూడా లబ్దిదారులకు జగన్ ఇవ్వకపోగా.. అప్పటికే పూర్తైన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసి వాటిని పాడుబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ చోరీకి పాల్పడింది ఎవరో తెలుస్తుందని టీడీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్