Sunday, March 22, 2026 01:31 PM
Sunday, March 22, 2026 01:31 PM

మొక్కకు మరో షాక్.. ఈసారి తీరానికే..!

“మీరు సైబరాబాద్‌లో నాటిన మొక్కను సార్ నేను..” ఈ మాట వింటే చాలు.. ఠక్కున గుర్తుకు వచ్చే పేరు విడదల రజిని. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన విడదల రజిని.. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడు వేదికపై చెప్పిన ఒక్క డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత సరిగ్గా ఏడాది కూడా తిరక్కముందే.. సైలెంట్‌గా వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత జగనన్నా.. అంటూ కొత్త పాట పాడిన రజిని.. స్థానిక నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు వ్యతిరేకంగా రాజకీయాలు చేసి.. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి తనదైన రాజకీయాలతో చెలరేగిపోయారు. గెలిచిన తొలిసారే జగన్ క్యాబినెట్‌లో కీలకమైన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను నిర్వహించారు.

Also Read : కరీంనగర్ వాసులకు బండి బంపర్ ఆఫర్..!

తెలుగు రాష్ట్రాల్లో విడదల రజినీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తన మాట తీరు, హావభావాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేశారు. ఇక అవినీతి ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికే క్వారీ యజమానులను వేధించారనే కేసులో రజిని మరిది అరెస్టు అయ్యారు కూడా. రజినీ పీఏను పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఆమె చెసిన హంగామా అంతా ఇంతా కాదు. సీఐ పైనే దాడికి యత్నించారు. ఇక ఎన్నికలప్పుడు టికెట్ ఇప్పిస్తా అంటూ ఏకంగా 8 కోట్లు తీసుకున్నారని వైసీపీ నేత బహిరంగ వేదికపైనే ఆరోపణలు చేశారు. దీంతో ఎన్నికల సమయానికి విడదల రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు జగన్. అక్కడ బీసీ కార్డు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం రాలేదు. పైగా ఎన్నికల సమయంలో ఆఫీసుపై దాడులు చేశారంటూ ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారు.

Also Read : జగన్ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటో..?

ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి చిలకలూరిపేటకు వచ్చేశారు రజినీ. ఇక జగన్ కూడా గుంటూరు వెస్ట్ కంటే చిలకలూరిపేట బెటర్ అని భావించారు. కానీ తాజాగా జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడదల రజినీని మరోసారి నియోజకవర్గం మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకున్న రేపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీకి సరైన నేత లేరు. గతంలో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరారు. మోపిదేవి పార్టీ మారిన తర్వాత రేపల్లెలో వైసీపీ పూర్తిగా బలహీనపడింది. తప్పని పరిస్థితుల్లో ఈపూరి గణేష్‌కు బాధ్యతలు అప్పగించినప్పటికీ.. పెద్దగా ఫలితం రాలేదని వైసీపీ అధినేతకు నివేదికలు అందాయి. దీంతో ఈపూరి గణేష్‌‌ను తప్పించి.. అతని స్థానంలో విడదల రజినీకి బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గం మార్పు అంశంపై విడదల రజినీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో.. వాటి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్