అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కుక్క పిల్ల.. కవితకు కాదేది అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ.. అలాగే.. ప్రచారానికి కాదేది అనర్హం అంటున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు అధికారంలోకి వద్దామా అని తహతహలాడుతున్నారు. అందుకే ఏ చిన్న అవకాశం దోరుకుతుందా అని దుర్భిణీ వేసి మరీ వెతుకుతున్నారు. చివరికి పాత వీడియోలను కూడా ఇప్పుడు జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేసి.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇక తమ పాలనలో ఎంతో మేలు జరిగిందని.. లక్షల కోట్లు ప్రజల జేబుల్లోకి నేరుగా చేరిందని.. కానీ ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అసలు జరిగిందో లేదో తెలియని విషయాన్ని కూడా భూతద్దంలో చూపించేందుకు కిందా మీద పడుతున్నారు వైసీపీ నేతలు.
Also Read : గంభీర్ కు గుడ్ బై చెప్పేస్తున్న బోర్డ్..?
ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షం లేదు. వై నాట్ 175 అని జగన్ ఎన్నికల్లో పోటీ చేశారు. అంటే తనకు ప్రతిపక్షమే అవసరం లేదని అర్థం. అసలు ప్రతిపక్షం లేని అసెంబ్లీ కావాలనుకున్నారు. జగన్ కోరుకున్నట్లే.. ఓటర్లు ప్రతిపక్షం లేకుండా చేశారు. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయింది. అయినా సరే.. తనని ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు జగన్. న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు రాదని వైసీపీ నేతలకు మొదటి రోజే తెలుసు. అయితే తల్లికి వందనం పథకం అమలు తర్వాత ప్రజల్లో రోజు రోజుకూ కూటమి సర్కార్‌కు గ్రాఫ్ పెరుగుతోందని గుర్తించిన వైసీపీ నేతలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు మెగా ప్లాన్ చేస్తున్నారు.
Also Read : ఆ నలుగురికి చంద్రబాబు మాస్ వార్నింగ్..!
జులై 2వ తేదీ నుంచి టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుపరిపాలనకు తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఇంటికి టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లాలని.. ప్రభుత్వం ఏడాది కాలంలో నిర్వహించిన పనులను వివరించాలన్నారు. అలాగే ప్రతి ఇంటికి జరిగిన మేలును వివరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి సర్కార్ పూర్తి చేసిందని.. ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఫోటోలను టీడీపీ గ్రూప్‌లో పోస్టు చేయాలని కూడా చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనని నేతల పట్ల క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని చంద్రబాబు, లోకేష్ హెచ్చరించారు.
Also Read : సోము వీర్రాజు జ్ఞాపకాలతో మాధవ్ ఎంపిక..?
ఇదే అదునుగా వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ నేతలు గ్రామాల్లో పర్యటించే సమయంలో గొడవలు చేయాలని వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారు. తమకు పథకాలు అందటం లేదని టీడీపీ నేతల ఎదుట తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేసే గొడవలను సొంత మీడియా ద్వారా ప్రచారం చేయాలనేది వైసీపీ నేతల ప్లాన్. వైసీపీకి సొంతగా సాక్షి పత్రిక, ఛానల్ ఉంది. అలాగే వందల యూ ట్యూబ్ ఛానల్స్‌ను వైసీపీ సోషల్ మీడియా వింగ్ నడిపించింది. అలాగే ఫేక్ అకౌంట్ల ద్వారా కూడా కావాల్సినంత ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వీటి సాయంతోనే కూటమి ప్రభుత్వంపైన, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం పైన కూడా తప్పుడు ప్రచారం నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. అందుకే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల సాయంతో సొంత మీడియా అండతో ఈ తరహా తప్పుడు ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిని టీడీపీ నేతలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.