పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కావడం ఏమో గాని గాని వైసీపీ మాత్రం ఇప్పుడు రాజకీయంగా పండగ చేసుకుంటుంది. మెగా ఫ్యామిలీలో చీలిక తెచ్చేందుకు ముందు నుంచి ప్రయత్నం చేస్తున్న వైసిపి అధిష్టానం… ఇప్పుడు సక్సెస్ అయినట్టే కనపడుతోంది. అల్లు అర్జున్ కు సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చి మెగా ఫ్యామిలీలో వివాదాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. వైసిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అలాగే రాయలసీమ ప్రాంతంలో కడుతున్న ఫ్లెక్సీలు అలాగే సినిమాలో లేని డైలాగులను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న విధానం చూసి ఇప్పుడు చాలామంది షాక్ అవుతున్నారు.
Also Read : మరి ఇలా అయితే ఎలా సజ్జల గారు…!
ఆ డైలాగులను మెగా అభిమానులు నిజమే అనుకుంటున్నారు. అయితే సినిమా చూసిన వాళ్ళు మాత్రం అసలు సినిమాలో ఆ డైలాగులు లేవని క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఇది మొత్తం వైసిపి అధిష్టానం మైండ్ గేమ్ అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మెగా ఫ్యామిలీలో చీలిక తెచ్చేందుకు అలాగే జనసేన పార్టీని టార్గెట్ చేసి అల్లు అర్జున్ ను ఒంటరి చేశారని ఈ టైంలో తాము అండగా నిలబడ్డామని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా పుష్ప సినిమాను పెద్ద ఎత్తున భుజానికి ఎత్తుకొని పైయిడ్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం గమనార్హం.
Also Read : వివేకా కేసు తేలేనా… పోలీసులతో ఆడుకుంటున్న అవినాష్ అండ్ గ్యాంగ్
ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. ఆ వాతావరణం మరింత రాజేసి వచ్చే ఎన్నికల నాటికి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ను పూర్తిగా బయటకు తీసుకురావాలని వైసిపి అధిష్టానం భావిస్తుంది. 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ ప్రచారం చేయడానికి మెగా ఫ్యామిలీతో పాటుగా అన్ని వర్గాలు తప్పుపట్టాయి. దీన్ని అదునుగా చేసుకున్న వైసిపి అధిష్టానం తమ రాజకీయానికి పదును పెడుతోంది. కాపు ఓట్ల మీద జగన్ దృష్టి సారించారు. కూటమికి వెళ్తున్న కాపు ఓట్లను అల్లు అర్జున్ ద్వారా తమ వైపుకు తిప్పుకునేందుకు జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా తెలుస్తోంది.




