Wednesday, February 4, 2026 07:56 PM
Wednesday, February 4, 2026 07:56 PM

వైసీపీకి ట్రబుల్‌ షూటర్స్ షాక్..!

వైసీపీ అధినేత జగన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎవరైతే మన అనుకున్నారో.. వాళ్లే ఇప్పుడు జగన్‌కు దూరంగా పోతున్నారు. పదేళ్లు పైగా పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు జగన్‌కు దూరమవుతున్నారు. ఓటమి బాధ నుంచి జగన్‌ కోలుకోక ముందే కీలక నేతలు షాక్ ఇస్తుండటంతో వైసీపీ భవిష్యత్ ఏమిటనేది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2014లో పార్టీ ఓడినప్పటికీ ప్రతిపక్ష హోదా సహా గౌరవప్రదమైన స్థాయిలోనే ఎమ్మెల్యేలు పార్టీకి ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి.. మళ్లీ ఓడిన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకదశలో పార్టీ భవిష్యత్‌ ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

Also Read: రాజకీయాలకు గుడ్‌ బై.. ఇక వ్యవసాయమే..!

2014 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష నేతగా జగన్‌ ఎన్నికయ్యారు. అయితే టార్గెట్ సీఎం ఛైర్ అన్నట్లుగా నాటి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసి ప్రజల్లో సింపథీ సాధించారు. ఇందుకు పార్టీ నేతలు కూడా తమ వంతు సాయం చేశారు. ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో జగన్‌ అక్రమాలకు, ఆర్థిక అవకతవకలకు పూర్తిస్థాయిలో సహకరించిన నేతలు వైసీపీలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వారికే జగన్ కీలక పదవులిచ్చారు కూడా.

అయితే ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. వై నాట్ 175 అని గొప్పగా ప్రకటించిన జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచింది. అదే సమయంలో 4 పార్లమెంట్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రతిపక్ష పదవి కోసం జగన్ పట్టుబట్టారు. అయితే రూల్స్‌ ప్రకారం సీట్లు సాధించలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదని స్పీకర్ స్పష్టం చేయడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను కూటమి ప్రభుత్వం వెలికి తీస్తుందని.. దీనిపై అసెంబ్లీలో వివరణ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో జగన్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు. దీంతో వైసీపీ నేతలో పార్టీ అధినేత జగన్‌పై గుర్రుగా ఉన్నారు.

Also Read: టీటీడీ సంచలన నిర్ణయం..? వారికి గుడ్ బై..?

ఇక ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత ముందుగా జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు ఎంపీ మోపిదేవి వెంకటరమణ జగన్‌కు షాక్ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత నమ్మిన బంటు ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు జగన్‌ తో తెగదెంపులు చేసుకున్నారు. ఇక ట్రబుల్ షూటర్ అనే పేరున్న విజయసాయిరెడ్డితో పాటు ఆర్థికంగా పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటున్న మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రతిపక్షంలో, అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరంతా జగన్ వెంటే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇలా పార్టీని వదిలి వెళ్లడం వెనుక జగన్ మాట తీరు, వ్యవహార శైలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: షాక్ ఇవ్వడానికి బొత్సా రెడీ..?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరితో కలివిడిగా ఉన్న జగన్… సీఎం అయిన తర్వాత మాత్రం దర్పం చూపించారు. చివరికి పార్టీ ముఖ్యనేతలు, మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఏదైనా పనుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో చర్చించాలన్నట్లుగా వ్యవహరించారు. చివరికి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా వీరి నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం, ప్రభుత్వంపై చెడ్డపేరు తారాస్థాయికి చేరడంతో ఎన్నికల్లో వైసీపీ బొక్కబోర్లా పడింది. చివరికి అతి కష్టం మీద 11 సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో వైసీపీకి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవని అప్పట్లోనే విమర్శలు చేశారు. దీంతో కీలక నేతలంతా జగన్‌తో ఉంటే తమకు కూడా కష్టాలు తప్పవనే భయంతో ముందే తమ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్