Wednesday, February 4, 2026 12:28 PM
Wednesday, February 4, 2026 12:28 PM

మిథున్ రెడ్డికి మద్దతు ఎక్కడ..? సైలెంట్ గా క్యాడర్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ కుంభకోణం కంటే.. ఆ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఓ సంచలనం అనే చెప్పాలి. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేదని చాలా మంది అంచనా వేసారు. కానీ అనూహ్యంగా ఆయనకు బెయిల్ రిజెక్ట్ కావడం, ఉన్నత న్యాయస్థానాల్లో కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో అరెస్ట్ కావడం తప్పనిసరి అయింది. ఇక విచారణలో మిథున్ రెడ్డి ఏం చెప్పారు, ఈ కేసులో ఆయన పాత్ర ఏంటీ అనేది ఇప్పటి వరకు ఓ స్పష్టత లేదు గానీ.. కుంభకోణంలో ఆయన పాత్ర మాత్రం కీలకం అనే క్లారిటీ ఉంది.

Also Read: భారత ప్రజలు అవమానం ఒప్పుకోరు.. పుతిన్ సంచలన కామెంట్స్..!

ఇదిలా ఉంచితే మిథున్ రెడ్డి బెయిల్ పై విడుదల అయ్యారు. విదుదల తర్వాత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసారు. తనను జైల్లో ఉగ్రవాది మాదిరి చూసారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. దీనికి మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కోర్ట్ కి కూడా వెళ్ళవచ్చు అంటూ సవాళ్లు కూడా చేసారు. కానీ.. వైసీపీలోని కీలక నేతల నుంచి మాత్రం స్పందన లేదు. ఒకప్పుడు మీడియాలో కనపడి అలజడి సృష్టించిన నాయకులు.. మిథున్ రెడ్డికి మాత్రం మద్దతు ఇవ్వలేదు. ఆయనకు అనుకూలంగా మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదు.

Also Read: కొబ్బరి నీళ్ళు తాగితే బరువు తగ్గుతారా..?

ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం పాత పదవిలో మిథున్ రెడ్డిని నియమించారు. కానీ సొంత జిల్లా నాయకులు గానీ, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లు గానీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా మీడియా ముందుకు రాలేదు. రాయలసీమ నాయకులు సైతం సైలెంట్ గానే ఉన్నారు. అటు సజ్జల రామకృష్ణా రెడ్డి గానీ, పేర్ని, అంబటి వంటి వాళ్ళు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. దీనితో పార్టీలో మిథున్ రెడ్డి ఒంటరి అని, ఆయనకు జగన్ సహకారం మాత్రమే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ పై వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్