వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని వైన్స్ షాపులను మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 17, 18 తేదీల్లో జంటనగరాల్లోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించారు.

17వ తేదీ ఉదయం 6గంటల నుంచి వైన్స్‌ను బంద్ చేయాలని పేర్కొ న్నారు. క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని బార్లను మినహాయింపు ఉందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి బంద్ చేయాలని, నియమాలను ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

