వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల మాదిరిగానే.. పరకామణి కేసులో కూడా నిందితులు మరణించే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు రాజకీయ సర్కిల్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి. టీటీడీ పరకామణిలో చోరీ కేసును బయటపెట్టిన నాటి టీటీడీ సహాయ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు సతీష్ కుమార్ వాంగ్మూలం చాలా కీలకం. దీని ఆధారంగా చాలా మంది అవినీతి బయటకు వస్తుందనేది అధికారుల మాట. ఇలాంటి సమయంలో సతీష్ హత్య.. ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
Also Read : బీహార్ లో ఆర్జెడి చివరికోట కూలిందా..? బీహార్ లో ఎన్డియే డామినేషన్..!
పరకామణి కేసుపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్య కేసులో కూడా సాక్ష్యులు ఇదే మాదిరి మరణించారు. వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరులో విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. వివేకా హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసు. ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్‌లో అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. వివేకా మరణ వార్త తెలిసిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వచ్చారు. వాళ్లు ప్రయాణించిన వాహనానికి నారాయణ యాదవ్ డ్రైవర్‌గా చేశారు.
ఇక వివేకా హత్య కేసు ప్రధాన సాక్ష్యుల్లో ఒకరు కల్లూరు గంగాధర్ రెడ్డి. ఈయన కూడా 2022 జూన్‌లో అనారోగ్యంతోనే మృతి చెందారు. వివేకాను హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తానని గంగాధర్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే చనిపోయాడు. ఇక వివేకా ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్‌మెన్ బి.రంగన్న కూడా అనారోగ్యంతోనే చనిపోయాడు. జగన్ తమ్ముడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయాడు. వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో అభిషేక్ రెడ్డి ఒకరు. వివేకాది గుండె పోటు కాదు.. దారుణమైన హత్య అని మొదట చెప్పింది అభిషేక్ రెడ్డి. డాక్టర్ అయిన అభిషేక్‌కు 30 ఏళ్లకే చెప్పలేని జబ్బు చేసి చనిపోయాడు. ఆ జబ్బు ఏమిటో వైఎస్ కుటుంబం ఇప్పటికీ బయట పెట్టలేదు.
Also Read : రంగంలోకి రవిశంకర్ అయ్యన్నార్.. సతీష్ హత్యలో సంచలన విషయాలు..!
ఇక వివేకా మృతదేహానికి కట్లు కట్టిన వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి కూడా అనారోగ్యంతోనే చనిపోయారు. పులివెందులలో గుర్తింపు పొందిన వైద్యుడుగా పేరు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికీ వ్యాధి వచ్చిన ఈసీ గంగిరెడ్డి దగ్గరికి వచ్చేవారు. అలాంటి గంగిరెడ్డి 2021లో తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. ఆయన శవం చూస్తే.. నెత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. ఇది మరో మిస్టరీ. మరో విషయం ఏమిటంటే.. గంగిరెడ్డి భార్య, కుమారుడు కూడా వైద్యులే. అయినా సరే.. ఈసీ గంగిరెడ్డి ఊరు పేరులేని జబ్బుతో పోయారు. వైద్యులకు కూడా అంతుబట్టని ఆ జబ్బు ఏమిటనేది బిగ్ క్వశ్చన్.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హత్యు గురైన పరిటాల రవి కేసులో కూడా సాక్షులు ఇలాగే పోయారు. హత్య చేసినట్లు స్వయంగా ప్రకటించిన రెండో నిందితుడు మొద్దు శీను 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైల్లో హతకు గురయ్యాడు. అప్రూవర్‌గా మారతానని చెప్పిన శీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ ఓంప్రకాశ్ సిమెంట్ డంబెల్‌తో కొట్టి చంపాడు. ఇక ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి. బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన సూరిని అతని ప్రధాన అనుచరుడైన భానుకిరణ్ కాల్చి చంపాడు. కారులో వెళ్తున్న సమయంలో 201 జనవరి 3న హైదరాబాద్ యూసుఫ్‌గూడలో సూరిని భానుకిరణ్ హత్య చేశాడు.
Also Read : పరిటాల నుంచి పరకామణి వరకు.. కీలక నిందితులు మరణాలు..!
ఇక పరిటాల హత్యకు ఆయుధాలు సమకూర్చడంతో పాటు కాల్పుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న గ్యాంగ్‌స్టర్ అజీజ్ రెడ్డి 2008 మే 1న ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పరిటాల కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత మృతదేహానికి రీ పోస్టుమామార్టం చేసిన బృందంలో ఉన్న సాంబశివరావు రైల్లోంచి దూకి చనిపోయాడు. జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు సూరికి సెల్‌ఫోన్లు అందించాడని.. వాటిలో మాట్లాడే పరిటాల రవి హత్యకు సూరి పథకం వేశారనే ఆరోపణలున్నాయి. రవి మర్డర్ జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మొద్దు శీనును హత్య చేసిన ఓం ప్రకాశ్ కూడా.. జగన్ ప్రభుత్వంలో అనారోగ్యంతో జైలులోనే చనిపోయాడు. ఇలా పరిటాల మర్డర్ కేసులో సాక్షులు, పాత్రధారులు, డాక్టర్లు, అధికారులు కూడా ఒక్కొక్కరుగా చనిపోయారు. వివేకా, పరిటాల కేసు మాదిరిగా.. టీటీడీ పరకామణి చోరీ కేసులో నిందితులు కూడా.. అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. సతీష్ కుమార్ మృతిపై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

