Wednesday, February 4, 2026 11:13 AM
Wednesday, February 4, 2026 11:13 AM

ఈ సీరీస్ లో అయినా ఆడతాడా..?

సాధారణంగా ఏ క్రీడల్లో అయినా కెప్టెన్ అంటే తాను సమర్థవంతంగా ఆడి జట్టును ముందుకు నడిపించడం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని తన వంతు పాత్ర పోషించడం. కానీ భారత టి20 జట్టులో మాత్రం ఇది డిఫరెంట్ గా ఉంటుంది. కెప్టెన్ హోదాలో ఉన్న సూర్య కుమార్ యాదవ్ గత రెండేళ్లుగా అత్యంత దారుణంగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. రోహిత్, విరాట్ కోహ్లీ, పూజారా, అశ్విన్ విషయంలో వయసు చూసిన హెడ్ కోచ్ గంభీర్ సూర్య కుమార్ యాదవ్ విషయంలో మాత్రం చూడలేదు. అతనిని కెప్టెన్ గా కొనసాగిస్తూ వస్తున్నాడు.

Also Read : పసికూనగా మార్చేసాడా..? అవమాన భారంతో భారత అభిమానులు..!

త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ కు కూడా అతనిని కెప్టెన్ గా ఎంపిక చేశారు. 360 డిగ్రీ ప్లేయర్ అంటూ ప్రశంసలు అందుకున్న సూర్య కుమార్ యాదవ్.. ఈ మధ్యకాలంలో క్రీజ్ లో నిలబడటానికి కూడా కష్టపడుతున్నాడు. కీలకమైన న్యూజిలాండ్ సిరీస్ లో అతను ఎలా ఆడతాడు అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ సిరీస్ లో రాణించి కనీసం టి20 వరల్డ్ కప్ లో అయినా సత్తా చాటాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే జట్టుకు భారంగా మారాడు అనే విమర్శలు వస్తున్నాయి. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో సైతం అతను కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉన్నప్పటికీ విఫలం కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read : గ్రేడ్ మార్పులు.. కోహ్లీ.. రోహిత్ కు షాక్ తప్పదా..?

ఆ తర్వాత అతనిని వన్డే జట్టు నుంచి తప్పించేసి టి20లకు మాత్రమే పరిమితం చేశారు సెలెక్టర్లు. కానీ t20 లో కూడా అతను రానించకపోవడంతో క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ సీరీస్ లో అయినా రాణిస్తే.. ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ లో అతను భారత్ కు బలంగా మారతాడని.. మరో రెండేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఒకానొక దశలో టి20 క్రికెట్ కు కొత్త పాఠాలు నేర్పిన సూర్య కుమార్ యాదవ్.. ఇప్పుడు జట్టుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. కెప్టెన్సీ పదవి కోసం పలువురు ఎదురుచూస్తున్న సమయంలో కూడా.. అతని కోసం బోర్డు అండగా నిలబడింది. అయినా సరే సూర్య కుమార్ యాదవ్ మాత్రం అవకాశాలు వినియోగించుకోవడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

పోల్స్