Wednesday, February 4, 2026 02:35 PM
Wednesday, February 4, 2026 02:35 PM

జోగిని సస్పెండ్ చేస్తారా..? వివాదాల ఆప్తుడు..!

జోగి రమేష్.. ఏపీ రాజకీయాల్లో.. ఓ మాజీ ఎమ్మెల్యే లేదా మాజీ మంత్రి లేదా నాయకుడు అనే వాటి కంటే వివాదాస్పద వ్యక్తి అనే మాట ఆయనకు బాగా నప్పుతుంది అంటారు రాజకీయాలను దగ్గరగా గమనించే వారు. నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉంటారు ఆయన. జగన్ పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ లో ఉన్న జోగి రమేష్.. అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాదులు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు.

Also Read : ఇక చాలు.. నెల్లూరులో జగన్‌కు షాక్ తప్పదా..?

ఇక 2014 నుంచి 2019 వరకు కాస్త జాగ్రత్తగా ప్రవర్తించిన జోగి.. 2019 లో పెడన నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి సిఎం జగన్ ఆశీర్వాదం కోసం ఎన్నో సందర్భాల్లో నోరు జారారు జోగి. ఏకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న సిఎం చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళారు జోగి. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సహా అనేక మందిపై తీవ్ర విమర్శలు చేసారు. దీనితో జగన్ ఆయనను మంత్రిని చేసారు. అప్పటి నుంచి వైసీపీ నేతలను కూడా ఆయన ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పాత్రతో వార్తల్లో నిలిచారు.

Also Read : అంచనాలను అందుకోలేని తెలుగు కుర్రాడు..?

ఏ1 గా ఉన్న అద్దేపల్లి జనార్ధన్ రావుకు 3 కోట్ల రూపాయలు ఇచ్చి నకిలీ మద్యం తయారు చేయించారు జోగి రమేష్ అనేది ప్రధాన ఆరోపణ. నకిలీ మద్యంలో జోగి రమేష్ కర్త, కర్మ, క్రియ అనే విషయం తాజా వాట్సాప్ చాటింగ్ తో బయటపడింది. దీనితో జోగి రమేష్ పై పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన సన్నిహితులపై నిఘా పెట్టిన పోలీసులు.. జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఒకవేళ జోగి రమేష్ దోషిగా తేలితే జగన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్