Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

మళ్లీ కుంటి సాకులు చెబుతున్న జగన్..!

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి.. అనే మాట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. ఏ పని చేయాలన్నా సరే.. కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. అది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అయితే ఒక్క అడుగు కూడా బయట పెట్టరు. అదే రాజకీయంగా లాభం జరుగుతుందంటే మాత్రం.. ఎంత దూరమైనా వెళ్తారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు దూరంగా పరదాలు కట్టుకుని తిరిగారు. ఇక ఓడిన తర్వాత అయితే సరే సరి.. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి మకాం మార్చేశారు. కేవలం రాజకీయాలకు, శవ పరామర్శలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వైఎస్ జగన్.. తాజాగా తన ద్వంద్వ నీతిని మరోసారి బయటపెట్టారు.

Also Read : జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ.. బీ అలర్ట్..!

రాజధాని అమరావతి పునఃనిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే అమరావతి ప్రాంతంలో 250 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను రాష్ట్ర పండుగలా ప్రతి ఒక్కరు భావించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇందుకోసం ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని స్వయంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గం నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ ఆహ్వాన పత్రిక అందించారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికలను స్వయంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు అందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కూడా ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

Also Read : మరో నోటు మాయమైతుందా..?

ప్రధాని ముఖ్య అతిధిగా హాజరయ్యే సభకు హాజరవ్వాలా వద్దా అనే విషయంపై మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో చర్చించారు. సభకు వెళ్లకపోతేనే బెటర్ అని వైసీపీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. నేతల మాటకే జగన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్య నేతలు చెప్పిన కారణం అక్కడే ఉన్న ఇతర నేతలకు నవ్వు తెప్పించినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రిక రాలేదని.. అయినా ప్రతిపక్ష నేతకు అధికారులతో ఆహ్వాన పత్రిక పంపిస్తారా అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్ అధికారులు తాడేపల్లిలోని జగన్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో లేరు. సింహాచలం పర్యటనకు వెళ్లినట్లు తెలుసుకున్న అధికారులు.. జగన్ పీఏకు ఆహ్వాన పత్రిక అందించారు. ఇది తమను అవమానించినట్లుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Also Read : దేవినేని ఇంట పెళ్ళిపై గులాబీ పార్టీ సామాజిక వర్గ కక్ష

అయితే వైసీపీ నేతల తీరుపై కూటమి సర్కార్ పెద్దలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఒకరు ఇస్తే వచ్చేది కాదని.. కనీసం పది శాతం సీట్లు గెలిస్తే… అదే వస్తుందని సూచించారు. హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి సభకు వచ్చేది లేదని చెప్పడం కుంటి సాకు అని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి శంఖుస్థాపనకు నాటి ప్రతిపక్ష నేతకు మంత్రి రావెల కిషోర్ బాబు స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు. కానీ అప్పుడు కూడా జగన్‌ ఆ కార్యక్రమానికి రాలేదని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉంటారని అందరికీ తెలుసన్నారు. కేవలం బటన్ నొక్కుడు తప్ప… చివరికి విజయవాడ నగరంలో పరదాలు కట్టుకునే ప్రయాణం చేశారని గుర్తు చేస్తున్నారు. అయినా అమరావతి రైతులను మోసం చేసిన జగన్… ఐదేళ్ల పాటు వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి.. జైళ్లకు పంపారని విమర్శలు చేస్తున్నారు. అలాగే రైతు ఉద్యమాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని వస్తారని నిలదీస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్