Wednesday, February 4, 2026 09:24 PM
Wednesday, February 4, 2026 09:24 PM

అమరావతి రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుందా..?

ఏపీ రాజధాని అమరావతిలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ హడావుడి కనిపిస్తుంది. మూసివేసిన ఆఫీసుల దుమ్ము దులుపుతున్నారు. సరిహద్దు రాళ్ళకు రంగులు వేస్తున్నారు. కొత్తగా ఫ్లెక్సీలు, జెండాలు కడుతున్నారు. మార్కెటింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి.. అంటే తెలంగాణ విడిపోతే రాజధాని ఎక్కడ అనే ప్రశ్న నుంచి మొదలు. ఫలానా చోటు రాజధాని అనే మాటలు.. అసెంబ్లీలో చంద్రబాబు రాజధాని ప్రకటన.. మోదీ శంకుస్థాపన, 2019 ఎన్నికల ముందు అమరావతిలో జగన్ కొత్త ఇంటి నిర్మాణం.. ఆ ఎన్నికల తర్వాత జగన్ మూడు రాజధానుల ప్రకటన.. తిరిగి 2024లో చంద్రబాబు గెలుపు… ఇలా ప్రతి అంశం వల్ల ప్రభావితమైంది అమరావతి రియల్ ఎస్టేట్.

Also Read : ఇంకెన్నాళ్లు ఈ సాగదీత..? టీటీడీపీ భవిష్యత్తు ఏంటీ..?

CRDA పరిధిలో స్థలం ఎక్కడ ఉంది.. అక్కడ భవిష్యత్తులో అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది.. అనే దానిపైనే ప్రస్తుతం వ్యాపారం ఆధారపడి ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ రంగాన్ని దగ్గర నుంచి పరిశీలించేవారు చెబుతున్నారు. ప్రస్తుతం అమరావతిలో పొలాలు ఎక్కడ కొనే పరిస్థితిలో లేదు. కోర్ క్యాపిటల్ పరిధిలో పొలాలు కొనగలిగే రేంజ్ లో కూడా ధరలు లేవు. అమరావతి చుట్టుపక్కల, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కడ కూడా పొలాలు కొని రేంజిలో ధరలు లేవు. ప్రస్తుతం ఒక అమరావతి ప్రాంతంలోనే కాకుండా.. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, బాపట్ల వరకు కూడా ధరలు భారీగానే పెరుగుతున్నాయి.

Also Read : మళ్లీ కుంటి సాకులు చెబుతున్న జగన్..!

అదే సందర్భంలో పెట్టుబడి పెట్టేవారు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో మాదిరి దుందుడుకుగా కాకుండా వ్యూహాత్మకంగా వెళుతున్నారు. పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు.. కొద్ది రోజులు ఆగుదాం అని ఆలోచిస్తున్నారు. చాలామంది కొనాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఒకసారి కచ్చితంగా దెబ్బ తగిలిన వాళ్ళు.. ఆచితూచి అడుగేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి చాలామంది.. పరిశీలన చేస్తున్నారు. కానీ కొనుగోలు సంఖ్య మాత్రం భారీగా పెరగలేదు. ఈ విషయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు వెల్లడించారు కూడా.

Also Read : సజ్జల.. సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస..!

రిజిస్ట్రేషన్లు పెరిగాయి కానీ.. ఎంత శాతం పెరిగాయి అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమన్నారు. అయితే ఎక్కువ మంది ప్రస్తుతం అగ్రిమెంట్ స్థాయిలో, వెయిట్ అండ్ సీ మోడ్ లో ఉన్నారని రియల్టర్లు చెబుతున్నారు. అలాగే.. విజయవాడ నగరంలో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరగలేదని కూడా వ్యాపారులు చెబుతున్నారు. మొత్తంగా ఎక్కువమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోడీ సభపై ఆసక్తిగా ఉన్నారు. ఆ తర్వాత అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అమరావతి అభివృద్ధికి కేంద్రం ప్రకటించే నిధులు, ఇప్పటికే కేంద్రం ప్రకటించిన పథకాల అమలు, కేంద్రం ఇచ్చే రాయితీలపై రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారపడి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్