Sunday, March 22, 2026 12:15 AM
Sunday, March 22, 2026 12:15 AM

ఆ పోస్టు మళ్లీ ఆయనకే ఎందుకు సార్..?

అనిల్ కుమార్ సింఘాల్ గారిని మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు నియమించారు..? సింఘాల్ గురించి అన్ని తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? ఇవే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో పాటు ఐఏఎస్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలు. అనిల్ కుమార్ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈవోగా నియమించటం వెనుక ఎవరెవరి ఒత్తిళ్లు, సిఫార్సులు పరిచేశాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. నిజానికి అనిల్ కుమార్ సింఘాల్ నియామకం ఇప్పుడు జరగలేదు. సరిగ్గా గతేడాది దసరా వార్షిక బ్రహ్మోత్సవాల ముందు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు సింఘాల్. అప్పటి నుంచి టీటీడీలో ఆయన పెత్తనం నడుస్తుందనేది బహిరంగ రహస్యం.

Also Read : వాళ్లు చట్టానికి అతీతులా.. విచారిస్తే తప్పేంటి..?

నిజానికి 2024లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. శ్రీలక్ష్మి, సునీల్ కుమార్ వంటి అధికారులపై చర్యలు చేపట్టారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెత్తనం చేసిన వారిని, టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలుంటాయని అంతా అనుకున్నారు. అయితే వీరి నుంచి అనిల్ కుమార్ సింఘాల్‌కు చంద్రబాబు మినహాయింపు ఇచ్చినట్లు అయ్యింది. దీని వల్ల చంద్రబాబు పరువు, ప్రతిష్ఠ మసకబారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లే ఇలాంటి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందనే మాట కూడా వినిపిస్తోంది.

తప్పులు చేసిన వారిని ఆ దేవదేవుడు ఎప్పటికీ క్షమించడు. ఇక ఆ శ్రీవారి సమక్షంలోనే అపచారం చేసిన వారికి ఎలాంటి శిక్షలు పడతాయి..? నిందితులను, నిందితులు అండగా ఉన్న వారిని కూడా శిక్షిస్తాడు ఆ దేవదేవుడు. అయితే తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే. తెలియక పట్టుకున్నా సరే.. నిప్పు కాలుతుంది. అలాగే తప్పు చేయకపోయినా.. కళ్లెదురుగా జరుగుతున్న తప్పును ఆపకపోయినా అతి తప్పు చేసినట్లే అవుతుంది. టీటీడీ ఈవో సింఘాల్‌కు నిజాయతీ పరులనే పేరుంది. అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామిపై అపార భక్తి కూడా. అయితే ఇక్కడే ఓ విషయం మాత్రం సింఘాల్ నిజాయితీని శంకిస్తున్నాయి.

Also Read : రాజధాని అమరావతిలో అట్టహాసం: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఆత్మవిశ్వాసం

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమలలో లెక్క లేనన్ని అక్రమాలు జరిగాయనేది వాస్తవం. అందులో అన్న ప్రసాదంలో నాణ్యతా లోపం, దర్శనం టికెట్ల కేటాయింపు, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణి చోరీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ కేసుల్లో ఇప్పుడు వైసీపీ పెద్దలు విచారణ ఎదుర్కొంటున్నారు కూడా. అయితే ఇక్కడే ఓ విషయం సింఘాల్ మెడకు చుట్టుకుంటోంది. గతంలో జరిగిన తప్పులకు వైసీపీ పెద్దలతో పాటు టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులతో పాటు అవినీతి ఆపని అధికారులు కూడా నిందితులే. కళ్ల ముందు శ్రీవారికి అపచారం జరుగుతుంటే.. కళ్లున్న గుడ్డి వారిలా, చెవులున్న వినపడనట్లు చెవిటి వారిలా నటించిన వారంతో దోషులే. ఈ జాబితాలో సింఘాల్ కూడా ఉన్నారు.

గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు టీటీడీ ఈవోగా కొనసాగారు సింఘాల్.. ఆ సమయంలోనే నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ల నిబంధనలో మార్పులు, చేర్పులు జరిగింది. నాటి టెండర్ ప్రక్రియ సింఘాల్ సమక్షంలో జరిగిందనేది టీటీడీ ఉద్యోగుల మాట. అయినా సరే సింఘాల్ ఒక్క అభ్యంతరం కూడా చెప్పలేదంటున్నారు. సింఘాల్‌ బదిలీ తర్వాత ధర్మారెడ్డి ఈవోగా వ్యవహరించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సర్వీస్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించింది. నిజానికి కల్తీ నెయ్యి కుంభకోణం బయటపెట్టింది సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు. కానీ ఆయనను బదిలీ చేసి.. ఆయన స్థానంలో సింఘాల్‌ను కూటమి సర్కార్ ఈవోగా నియమించింది.

Also Read : ఆ విషయంలో ఇద్దరు సీఎంలు ఒకటే..!

నిజానికి శ్యామలరావును ఎందుకు బదిలీ చేశారంటే.. అందుకు ఈవో – ఛైర్మన్ మధ్య ఆధిపత్య పోరును సాకుగా చెబుతున్నారు. కానీ.. శ్యామలరావుతో కంటే కూడా జేఈవో వెంకయ్య చౌదరీతోనే ఛైర్మన్‌కు పడటం లేదనేది ఉద్యోగుల మాట. 2005 బ్యాచ్‌కి చెందిన ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరి జూలై 2024లో టీటీడీ అదనపు ఈవోగా నియమితులయ్యారు. నాటి నుంచి ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా కొండపై సాగుతోందనేది ప్రధాన ఆరోపణ. ఈవో వర్సెస్ జేఈవో, ఛైర్మన్ వర్సెస్ జేఈవో అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనూహ్యంగా ఈవో శ్యామలరావును బదిలీ చేసింది. అసలు శ్యామలరావును ఎందుకు తప్పించారనేది ఇప్పటికీ జవాబు తెలియని ప్రశ్న.

కల్తీ నెయ్యి కుంభకోణం జరిగిన సమయంలో ఈవోగా సింఘాల్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అన్ని తెలిసి కూడా సింఘాల్‌ను ఈవోగా మళ్లీ ఎందుకు నియమించారనే విషయం ఇప్పటికీ అర్థం కావటం లేదంటున్నారు టీటీడీ ఉద్యోగులు. నిజానికి అప్పటి పర్చేజ్ కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి పార్థసారధిని, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిి ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. కానీ.. నాటి కల్తీ నెయ్యి టెండర్ ప్రక్రియకు ప్రత్యక్ష సాక్షి సింఘాల్‌ను మాత్రం సిట్ బృందం చూసీ చూడనట్లు వదిలేస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. అసలు సింఘాల్‌ను కాపాడుతున్న పెద్దలెవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్