Wednesday, February 4, 2026 02:14 PM
Wednesday, February 4, 2026 02:14 PM

ఆ నేతకు అండగా “కాపు” కాస్తోంది ఎవరు..?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు రెచ్చిపోయిన నేతలంతా ఇప్పుడు చాలా మంది సైలెంట్‌గా ఉన్నారనే చెప్పాలి. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతలు ఇప్పుడు ఎక్కుడున్నారో కూడా తెలియటం లేదు. అప్పట్లో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో మకాం మార్చేశారనేది బహిరంగ రహస్యం. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించడంతో పాటు.. తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలపై రెచ్చిపోయిన మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఎందుకు ఊదాసీనంగా వ్యవహరిస్తోందో అర్థం కావటం లేదనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు వేస్తున్న ప్రశ్న. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా జనసేన పార్టీ అధినేతపై ఒంటికాలితో దూకుడుగా వ్యవహరించారు. ఒక ప్రెస్ మీట్‌లో కులం పేరుతో బూతులు తిట్టారు. చెప్పులు చూపించి మరీ రెచ్చగొట్టారు.

Also Read : ఖమ్మం జిల్లాలో టీడీపీ సంచలనం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నంలో పేర్ని కుటుంబం పేరుతో ఉన్న గోదాంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం నిల్వలపై అధికారులు విచారణ చేపట్టారు. సుమారు 3 కోట్ల విలువైన పేదల బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పేర్ని కుటుంబం కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలోకి కూడా వెళ్లింది. పేర్ని జయసుధను పోలీసులు విచారించారు కూడా. బియ్యం అమ్ముకున్నట్లు ఒప్పుకున్న పేర్ని కుటుంబం.. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తామంటూ లేఖలో కోరారు కూడా. పేదల బియ్యం అమ్ముకున్నట్లు స్పష్టంగా లేఖ ఇచ్చినా కూడా.. ఆ కుటుంబంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక రప్పా రప్పా అనటం కాదు.. కన్ను కొడితే చీకట్లో పనైపోవాలి అంటూ సొంత పార్టీ నేతలను రెచ్చగొట్టారు పేర్ని. ఆ వీడియో బయటకు వచ్చినా సరే.. ఎలాంటి చర్యలు లేవు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి సీఐ‌పైన బూతులతో రెచ్చిపోయారు నాని. నా మనుషులనే అరెస్టు చేస్తావా.. నీ సంగతి చూస్తా అంటూ బూతులతో రెచ్చిపోయారు. కేవలం కేసు నమోదు చేశారు తప్ప.. ఎలాంటి చర్యలు లేవు.

Also Read : అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్న విడుదల రజనీ..?

తాజాగా నవంబర్ 4వ తేదీన పామర్రులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్‌ పర్యటించారు. ఆ సమయంలో విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనిపై పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ వాగ్వాదానికి కూడా దిగారు. దీంతో అనిల్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారెంట్ కూడా జారీ చేశారు. కానీ అదే రోజు మచిలీపట్నంలో సీఐ ఏసుబాబుతో పేర్ని నాని కుమారుడు కిట్టూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. మనుషులను తీసుకెళ్తాం.. దమ్ముంటే ఆపుకో అంటూ సవాల్ కూడా విసిరారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ వ్యవహారంపై ఇప్పుడు కూటమి సర్కార్‌ పెద్దలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితుడు కాబట్టే అనిల్ పైన కేసులు పెట్టారని.. దళిత సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అదే సమయంలో సీఐ ఏసుబాబుకు మద్దతుగా బీసీ సంఘాల నేతలు రంగంలోకి దిగారు. గతంలో కూడా స్టేషన్‌లో ఏసుబాబుపై పేర్ని నాని రెచ్చిపోయినా కూడా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్రుగా ఉన్నారు. కాపు నేత కాబట్టే పేర్ని నానిపై చర్యలు తీసుకోవడానికి కూటమి పెద్దలు వెనకడుగు వేస్తున్నారా.. అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పేర్ని వ్యవహారంలో అండగా ఉండి కాపలా కాస్తూ.. కాపు కాస్తోంది ఎవరూ అనే ప్రశ్న వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్