Thursday, February 5, 2026 12:02 AM
Thursday, February 5, 2026 12:02 AM

లడ్డు పాపంలో ఆ నలుగురూ రెడ్లే…?

ఆంధ్రప్రదేశ్ లడ్డు వ్యవహారం విషయంలో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.., సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.., చంద్రబాబు నాయుడు మత రాజకీయం చేస్తున్నారు, తక్కువ ధరకు నెయ్యి తీసుకు రావడంలో తప్పేంటి, నేను గుడికి వెళ్లి ప్రమాణం చేస్తా… నేను గుడిలోనే ఉన్నా, కావాలంటే ప్రమాణం చేస్తున్నా, 45 సార్లు మాల వేసుకున్నారు, సూపర్ స్వామి… నందిని కంపెనీ కంటే ఏఆర్ డైరీ తక్కువకు నెయ్యి ఇస్తా అని ముందుకు వచ్చింది, కల్తీ నెయ్యి కొన్ని ట్యాంక్ లు వెనక్కు పంపించాం..

ఈ వ్యాఖ్యలు అన్నీ చేసింది కేవలం నలుగురే. అసలు లడ్డు వివాదంలో స్పందించింది కూడా ఆ నలుగురే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, కాస్తో కూస్తో విజయసాయి రెడ్డి. మీడియాలో హైలెట్ కాకపోయినా మాట్లాడిన మరికొంతమందిలో ఆర్కే రోజా రెడ్డి, మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు తప్పించి వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా లడ్డుపై మాట్లాడే సాహసం చేయలేదు. లడ్డు వివాదంలో భుజాలు తడుముకున్నది ఆ పార్టీలో ఉన్న రెడ్లే.

Read Also : లడ్డు వివాదం పై నాయకుల మౌనం దేనికి సంకేతం?

ఇతర సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి, అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నానీ, పేర్ని నానీ… ఇలా చాలా మందే ఉన్నారు. దీనితో సోషల్ మీడియాలో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే పాపం చేసింది ఆ నలుగురేనా, అందుకేనా ఆ నలుగురితో మాట్లాడించారు, వైసీపీలో హిందువులు లేరా, ఇతర సామాజిక వర్గాల వాళ్ళు లేరా…? వైసీపీలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ మతం మారిన వాళ్ళే కదా… అసలు పొన్నవోలుకి లడ్డు కి సంబంధం ఏంటీ, మాట్లాడిస్తే పక్కనే ఉండే చెవిరెడ్డి తో మాట్లాడించాలి గాని అంటూ సెటైర్ లు వేస్తున్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడతారు అనుకున్నారు గాని ఎందుకో ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు మరి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్