స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సి భారత పర్యటన సూపర్ సక్సెస్ అయింది. కలకత్తా మొదలు హైదరాబాద్, ముంబై నగరాల్లో పెద్ద ఎత్తున క్రీడాభిమానులు అతన్ని చూసేందుకు బారులు తీరారు. కలకత్తాలోని సాల్ట్ లేక్ మైదానంలో మెస్సి ఎక్కువసేపు ఉండకపోవడంతో అభిమానులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ హైదరాబాద్ లో మాత్రం మెస్సి ఎక్కువ సమయం గడపడంతో.. అభిమానులు పండగ చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఆయన మైదానంలో సందడి చేశారు. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న ప్రశ్న మెస్సి ఎందుకు ఫుట్ బాల్ ఆడలేదు అని..
Also Read : గ్రామాల్లో కమలానికి దిక్కు ఎవరు
అయితే దీనికి తాజాగా అంతర్జాతీయ మీడియా ఆన్సర్ చెప్పింది. మెస్సి ఎడమ కాలికి ఉన్న ఖరీదైన ఇన్సూరెన్స్ కారణంగానే అతను రిస్క్ చేయలేదంటూ పేర్కొంది. స్టార్ ఆటగాడు కావడంతో అతను తన కాలుకు భారీ ఇన్సూరెన్స్ చేయించాడు. మెస్సి ఎడమ కాలుతోనే ఎక్కువగా ఫుట్ బాల్ ఆడుతూ ఉంటాడు. డ్రిబ్లింగ్, షాట్స్ కు ఈ కాలు ఎంతో కీలకం. దీనితో భారీ ఇన్సూరెన్స్ చేయించారు. దీని విలువ సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 8,151 కోట్ల రూపాయలు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్స్ బాడీ పార్ట్ ఇన్సూరెన్స్. యూరప్ కరెన్సీ విషయానికి వస్తే 750 మిలియన్ యూరోలు గా అంతర్జాతీయ మీడియా తెలిపింది.
Also Read : మంత్రి లోకేష్‌కు ఆ విషయంలో ఇబ్బందులు..!
దీని ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి. మెస్సి తన క్లబ్ ఇంటర్ మయామీ, అర్జెంటీనా జాతీయ టీం కు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఫ్రెండ్లీ మ్యాచ్‌లు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో అతను ఆడకూడదు. అతను హైదరాబాద్, ముంబైలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడకపోవడానికి ఇదే కారణం. నిబంధనలను ఉల్లంఘించి అతను ఆడి, ఏదైనా గాయం జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే అతను ఫుట్ బాల్ ఆడలేదు. ఇక ఇతర ఫుట్ బాల్ ఆటగాళ్ళ కాళ్లు విలువ చూస్తే.. డేవిడ్ బెక్ హామ్ రెండు కాళ్లకు 195 మిలియన్ డాలర్లు, క్రిస్టియానో రోనాల్డో రెండు కాళ్లకు 90 మిలియన్ డాలర్లు ఇన్సూరెన్స్ చేయించారు. వాళ్లకు కూడా పై నిబంధనలు వర్తిస్తాయి.

