తెలుగుదేశం పార్టీలో తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మధ్య విభేదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు టిడిపి అధిష్టానం రంగం సిద్ధం చేసింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, పరిస్థితులు ఏ విధంగా మలుపు తిరుగుతాయా అనే ఆసక్తి నెలకొంది. వాళ్ళిద్దరీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇటీవల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇద్దరితో సమావేశమయ్యారు. అసలు సమస్య ఎక్కడ నుంచి వచ్చింది అనే దానిపై పూర్తిస్థాయిలో ఇద్దరినీ అడిగి వివరాలు తీసుకున్నారు.
Also Read : తెలంగాణాలో భారీ పెట్టుబడి ప్లాన్.. చివరకు ఏపీకి.. అసలేం జరిగింది..?
క్రమశిక్షణ కమిటీ ముందు ఇద్దరు నేతలు వివరణ ఇచ్చిన నేపథ్యంలో, ఆ నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు పల్లా శ్రీనివాసరావు అందించే అవకాశం కనబడుతోంది. చాలా రోజుల తర్వాత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళుతున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరు నేతలకు కూడా పిలుపు వచ్చినట్లు సమాచారం. ఈ సమస్య కారణంగా కార్యకర్తలు ఇబ్బంది పడడమే కాకుండా, పార్టీ పరువు కూడా పోతోంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనే డిమాండ్ కూడా వినపడుతోంది.
అయితే కమ్మ సామాజిక వర్గం వర్సెస్ ఎస్సీగా వివాదం మారే అవకాశం ఉన్న నేపథ్యంలో, చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొలికిపూడి శ్రీనివాసరావు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే విషయం, స్పష్టంగా అర్థం అవుతూ వస్తోంది అంటూ టిడిపి క్యాడర్ మాట్లాడుకుంటుంది. అయితే ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఇద్దరు నేతలని చేయాలని.. ఎవరిని సస్పెండ్ చేసినా, సామాజిక వర్గాల లెక్కల ప్రకారం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీనితో చంద్రబాబు కూడా ఈ విషయంలో దూకుడుగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది అంటున్నాయి టిడిపి వర్గాలు.
Also Read : నా బరువుతో నీకేం పని.. నటి సీరియస్..!
క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉండే అవకాశం ఉందని.. ఏ చర్య తీసుకున్న సరే ఇద్దరు నేతలకు సమానంగా ఉండాల్సిందే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు కూడా ఉన్నాయి. మరి దీనిపై చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. కొలికిపూడి మాత్రం చిన్ని తో కలిసి పనిచేసేందుకు ముందుకు రావటం లేదు. అటు చిన్ని కూడా ఈ విషయంలో అలాగే ఉన్నారు. తాజాగా తిరువూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎంపీ ఫోటోలు లేకుండా నిర్వహించారు కొలికిపూడి. మరి చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి.

