Wednesday, February 4, 2026 12:43 PM
Wednesday, February 4, 2026 12:43 PM

ఆ ఐఏఎస్ అధికారులంటే ఎందుకంత ప్రేమ..?

ఆ ఐఏఎస్ అధికారులే.. సీఎం చంద్రబాబుకు ఎందుకు అంత ప్రేమ.. ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో, సచివాలయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిజాయితీ, సమర్థత కంటే కూడా.. అవినీతి అదనపు అర్హతగా, కులంతో పాటు వ్యక్తిగత అభిమానం, నమ్మకం ప్రభావాలు ఎక్కువగా పనిచేయగా.. చంద్రబాబు హయాంలో వ్యక్తిగత అభిమానం, ఇష్టాల కంటే.. నిజాయితీ, సమర్థతతో పాటు కష్టపడి పనిచేసే వారికే ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారికే సీఎం చంద్రబాబు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారికి మాత్రమే ప్రాధాన్యత పోస్టులు లభిస్తాయి కూడా.

Also Read : మోదీ తర్వాత ప్రధాని పదవి ఎవరికో తెలుసా..?

కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి, వైసీపీ ప్రభుత్వంతో అంట కాగిన వారికి కూడా కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత పోస్టులు లభించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు ఐఏఎస్ అధికారులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టాన్ని, అభిమానాన్ని వదులుకోలేకపోతున్నారట. ప్రస్తుతం సీఎం కార్యాలయంలోనే వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. వారి ఆశీస్సులతోనే కొందరు వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యత పోస్టులు దక్కాయనేది సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

అదే విధంగా అనేకమంది వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులకు శాఖాధిపతి పోస్టులు, కలెక్టర్ పోస్టులు దక్కటం వెనుక లోకేష్ కోటరి పాత్ర కూడా ఉందనే మాట బాగా వినిపిస్తోంది. నిజానికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి నారా లోకేష్ చుట్టూ ఓ కోటరీ చేరింది. వారంతా.. లోకేష్ పేరుతో కిందిస్థాయి నేతలు, అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. నిజానికి ఇదంతా లోకేష్‌కు ఏ మాత్రం తెలియదు. కానీ ఈ కోటరీ మాత్రం.. ఆయన పేరును రిపేరు చేస్తూనే ఉన్నారు.

Also Read : వైసీపీ క్యాడర్ లో కేసీఆర్ జోష్.. పండగే..!

తాజాగా వివిధ వర్గాల నుండి సేకరించిన సమాచారం మేరకు, సచివాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులే కష్టపడి పనిచేస్తున్నారని.. ఆ విధంగా కష్టపడుతున్న అధికారులనే సీఎం చంద్రబాబు నమ్ముతున్నారని తెలిసింది. సకాలంలో కార్యాలయానికి వచ్చి.. పని అయ్యే వరకు ఆఫీసులో ఉంటున్న వారు ఎవరు అనే విషయాన్ని చంద్రబాబు వివిధ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నివేదికలో ఇప్పటికీ కొందరు ఐఏఎస్ అధికారులు వైసీపీ మత్తు నుంచి ఇంకా బయటకు రాలేదని కూడా చంద్రబాబు దృష్టికి వచ్చింది.

ప్రస్తుతం చంద్రబాబు చేతిలో ఉన్న నివేదిక ప్రకారం.. ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్న వారిలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి వినయచంద్, మహిళా, స్త్రీ సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మువ్వల తిరుమల కృష్ణ బాబు, సర్వీస్ నుండి రిటైర్ అయిన కూడా సర్వీస్ పొడిగింపులో వున్న బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రమే వున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సీఎంవోలో వివిధ హోదాల్లో పని చేస్తున్న ముద్దాడ రవిచంద్ర, రాజమౌళిను మాత్రమే సీఎం చంద్రబాబు ఎక్కువగా నమ్ముతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read : ఆయనను ఒంటరిని చేసిన కమలనాథులు..!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పైన సీఎం చంద్రబాబుకి ఎంత నమ్మకం ఉందో అనే విషయం పక్కన పెడితే కొంతమంది ఐఏఎస్ అధికారుల కన్నా ఆయన జూనియర్ అయినప్పటికీ ఒత్తిళ్ల తోనే సీఎస్‌గా నియమించారని.. సర్వీస్ నుండి రిటైర్డ్ అయినప్పటికీ.. ఆయనకు మరో మూడు నెలలు సర్వీస్ పొడిగించటం వెనుక కూడా ఒత్తిళ్ళు పనిచేశాయనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్