Wednesday, February 4, 2026 07:05 PM
Wednesday, February 4, 2026 07:05 PM

ప్రచారానికి ఆ ముగ్గురు దూరం.. కారణాలేమిటో..?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే మూడు పార్టీల తరఫున ముఖ్యనేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు గెలుపు బాధ్యతను తమ భూజానికెత్తుకున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రచారంతో మూడు పార్టీలు ఓటర్లను హోరెత్తిస్తున్నాయి.

Also Read : రోజా.. ఏంటి ఇలా మారిపోయారు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. దీంతో సానుభూతి ఎక్కువగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ని రంగంలోకి దింపింది. బస్తీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో.. బీసీల ఓట్లు తమకే పడతాయనేది కాంగ్రెస్ ప్లాన్. బీజేపీ తరఫున మరోసారి దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ప్రచార హోరును చూస్తుంటే.. పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అటు సర్వే సంస్థలు కూడా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి డిపాజిట్లు కూడా వచ్చేలా లేవని తేల్చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ విషయం ఆసక్తిగా మారింది.

Also Read : ప్రశాంత్ వర్మపై నిర్మాతల ఆగ్రహం – వంద కోట్ల అడ్వాన్స్ వివాదం?

మొదట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావించారు. అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరు కూడా దాదాపు ఖరారు చేశారు. అయితే ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీని ఒప్పించిన బీజేపీ.. తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో.. పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. ఇక ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తన మద్దతు బీజేపీకే అని ప్రకటించారు. కానీ టీడీపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో టీడీపీ మద్దతు ఎటూ అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇక ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో.. బీజేపీ తరఫున చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అనే విషయం ఆసక్తిగా మారింది. నిజానికి కేసీఆర్ కోసం గులాబీ శ్రేణులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ కేసీఆర్ ప్రచారంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇక పవన్ కూడా ప్రచారం చేయడం అసాధ్యమంటున్నారు బీజేపీ నేతలు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ వెళ్తున్నప్పటికీ.. నేరుగా ఇంటికే పోతున్నారు తప్ప.. టీ టీడీపీ నేతలను కూడా కలవటం లేదు. దీంతో చంద్రబాబు, పవన్ ప్రచారం చేసే అవకాశమే లేదని తేలిపోయింది. మరి కేసీఆర్ అయినా తన అభ్యర్థి కోసం ప్రచారం చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్