Sunday, March 22, 2026 11:11 AM
Sunday, March 22, 2026 11:11 AM

కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది ఆ ఇద్దరే..!

త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటన భారత జట్టుకు అతిపెద్ద సవాల్ కానుంది. కీలక ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, అశ్విన్ రిటైర్మెంట్లతో భారత జట్టు సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇటీవల భారత జట్టు టెస్ట్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ను ఎంపిక చేసిన నేపధ్యంలో జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టుపై భారత కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచన ఎలా ఉండబోతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Also read : అల్టిమేట్ టెస్ట్.. సౌత్ ఆఫ్రికా కష్టమేనా..?

ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ స్థానాలను ఏ విధంగా భర్తీ చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఓపెనింగ్ జోడి.. కెఎల్ రాహుల్ – జైస్వాల్ తో ఇబ్బంది లేకపోయినా మూడు, నాలుగు స్థానాల విషయంలో క్లారిటీ రావడం లేదు. సాయి సుదర్శన్ తుది జట్టులో ఉంటే మూడవ స్థానంలో ఆడిస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. కరుణ్ నాయర్ 5 వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచి ఫలితం ఉండవచ్చు.

Also read : తన లక్కీ నెంబరే తన చివరి రోజు.. విజయ్ రూపాని విషాదం

ఇక నాలుగవ స్థానంలో గిల్ బ్యాటింగ్ చేస్తే విరాట్ కోహ్లీ లేని లోటుని కాస్త భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అభిమన్యు ఈశ్వరన్ కు అవకాశం ఇస్తే మాత్రం అతడు మూడవ స్థానానికి సరిపోతాడు అనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి కంటే శార్దుల్ ఠాకూర్ అయితేనే పేస్ ఆల్ రౌండర్ గానే సరిపోతాడు అనే అభిప్రాయాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో జడేజా, బూమ్రా, ప్రసిద్ కృష్ణ, సిరాజ్, అర్శదీప్ సింగ్ అయితే జట్టు బ్యాలెన్స్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్