Sunday, March 22, 2026 01:35 PM
Sunday, March 22, 2026 01:35 PM

వైసీపీ కష్టానికి ఆ నలుగురే కారణమా..?

పీకల్లోతు కష్టాల్లో వైసీపీ కూరుకుపోయింది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమే. జాతీయ పార్టీలు మొదలు, ప్రాంతీయ పార్టీలు కూడా గెలుపు ఓటములను రుచి చూసినవే. పదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పదేళ్లు ప్రతిపక్షంలో ఉంది. అలాగే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఐదేళ్లు అధికారం అనుభవించింది. అయితే ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధం. ఇప్పటి వరకు ఏ పార్టీకి లేనన్ని కష్టాలు వైసీపీని చుట్టేస్తున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు వైఎస్ జగన్. అందుకే ఎన్నికల్లో వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు పార్టీ కార్యకర్తలే అంటూ గొప్పగా ప్రకటించారు కూడా. వై నాట్ 175 అని చెప్పిన జగన్‌… 11 స్థానాలు మాత్రమే రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చివరికి తాడేపల్లి నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాడు జగన్.

Also Read : రాజకీయాలకు గుడ్‌ బై.. ఇక వ్యవసాయమే..!

వైసీపీలో నెంబర్ టూ పొజిషన్‌లో ఉన్న నేతల్లో ఒకరు విజయసాయిరెడ్డి. రాజ్యసభకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. వైసీపీ ఓడిన తర్వాత కీలక నేతలంతా జగన్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య… ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్‌ పెద్దగానే ఉంది. పార్టీ ప్రారంభం నుంచి జగన్‌తో ఉన్న నేతలు ఒక్కసారిగా దూరమవ్వడంతో కిందిస్థాయి కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. గతంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తానంటూ గొప్పగా ప్రకటించిన జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా రాలేదనేది పార్టీ నేతలే విమర్శిస్తున్న మాట. ప్రస్తుత పరిస్థితికి ప్రధానంగా నలుగురు నేతలే కారణమనే మాట బలంగా వినిపిస్తోంది.

Also Read : జరిగిందిదే.. ఐటీ రైడ్స్ పై దిల్ రాజు వ్యాఖ్యలు..!

వైసీపీలో తొలి నుంచి చక్రం తిప్పుతున్న నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలకం. సజ్జలకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇచ్చిన జగన్‌.. ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆయనతోనే చర్చించాలని జగన్ సూచించారు. దీంతో పార్టీలో కొందరు నేతలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన జగన్‌.. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు కూడా అప్పగించారు. వైవీ హయాంలోనే తిరుమల పవిత్రతకు భంగం కలిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఇక పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిని కూడా రీజనల్ కో ఆర్డినేటర్‌ను చేశారు జగన్. టీడీపీ నేతలతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక మరో కీలకమైన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. టీటీడీ బోర్డు మెంబర్‌తో పాటు పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ నలుగురి వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చిందని… అలాగే పార్టీలో ముఖ్యనేతలంతా ఇప్పుడు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిపై ఆర్థిక పరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. వీళ్లను పక్కన పెట్టకపోతే భవిష్యత్తులో వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవనే మాట బలంగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్