Wednesday, February 4, 2026 09:40 AM
Wednesday, February 4, 2026 09:40 AM

ఆ సీనియర్ కే టీడీపీ రాష్ట్ర పగ్గాలు..?

టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి గత ఆరు నెలలుగా ఏదో ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో తలమునకలై ఉన్న నేపథ్యంలో.. టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో గట్టి కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న పల్లా శ్రీనివాసరావును.. మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనే ప్రచారం నేపథ్యంలో.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలి అనేదానిపై పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. బీసీ నేతకే అవకాశం ఇవ్వాలని.. సీఎం చంద్రబాబు తో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రివ్యూ రిపోర్ట్

ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించి.. పల్లా శ్రీనివాసరావును క్యాబినెట్లోకి తీసుకుని.. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు పార్టీ పెద్దలు. పల్లా శ్రీనివాసరావు ప్రతిపక్షాలపై విమర్శలు చేసే విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నారని ప్రచారం కూడా ఉంది. ఇదే సమయంలో పార్టీ నేతలను కంట్రోల్ చేయలేకపోతున్నారనే అభిప్రాయం కూడా కొంత వినపడుతోంది. వైసీపీ చేస్తున్న ప్రచారాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వాస్తవాలను తీసుకు వెళ్ళలేకపోతున్నారని అభిప్రాయం కూడా కొంత అధిష్టానం వ్యక్తం చేస్తుంది.

Also Read : జగన్ అధికారంలో అక్రమాలు – బయటపడితే వేధింపులా..?

అందుకే పార్టీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు మాట వినే విధంగా.. ప్రతిపక్షాలపై విమర్శలు చేసే విధంగా ఉండేలా రాష్ట్ర అధ్యక్ష నియామకం ఉండాలని.. అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత పేరు కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో వినపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన విజయాలు సాధించాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని.. ఇటు పార్టీ కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాబోయే నెల రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకొని అమలు చేయాలని అధిష్టానం అడుగులు వేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్