Wednesday, February 4, 2026 05:55 PM
Wednesday, February 4, 2026 05:55 PM

వైసీపీలో సాయిరెడ్డి రీప్లేస్‌మెంట్..!

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా, 3 తరాలుగా వైఎస్ కుటుంబంతో అనుబంధమున్న వ్యక్తిగా విజయసాయిరెడ్డికి గుర్తింపు. జగన్ ఆస్తులు, కేసులు, రాజకీయ వ్యవహారాలు అన్నీ విజయసాయిరెడ్డికి తెలుసు. అటు ఢిల్లీలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రధాని మోదీతో పాటు ఢిల్లీ పెద్దలతో సాయిరెడ్డి ఎంతో కలివిడిగా తిరిగారు. అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగారు సాయిరెడ్డి. జగన్‌కు సంబంధించిన చాలా పనులను ఢిల్లీ స్థాయిలో చక్కబెట్టిన ఘనత సాయిరెడ్డి సొంతం. అలాంటి సాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం వైసీపీకి, వైఎస్ జగన్‌కు కూడా గట్టి దెబ్బ అనేది వాస్తవం.

Also Read : తిరుమలలో కేంద్ర బలగాలు: బీఆర్ నాయుడు కీలక ప్రకటన

అయితే సాయిరెడ్డి ప్లేస్‌ను భర్తీ చేసేందుకు జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే స్థాయిలో గుర్తింపు ఉన్న నేతను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో ఎలాంటి విభేదాలు లేని వ్యక్తి కోసం జగన్ తీవ్రంగా అన్వేషిస్తున్నారు. లండన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన జగన్… ఈ నెల 3, 4 తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు. అదే సమయంలో సాయిరెడ్డి రాజీనామా నేపథ్యంలో ఆ బాధ్యతలను మరో సినీయర్ నేతతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : కేంద్ర బడ్జెట్లో హైలెట్స్ ఇవే.. స్టార్టప్‌లకు పండుగే

పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి చాలా కీలకమైన నేత. రాజ్యసభలో వైసీపీ పక్షనేతగా కూడా సాయిరెడ్డి వ్యవహరించారు. పార్టీ నుంచి ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి కీలక నేతలు రాజ్యసభలో ఉన్నప్పటికీ… వైసీపీ పక్ష నేత బాధ్యతలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, మంత్రిగా కూడా వ్యవహరించిన సుభాష్.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాంగ్రెస్ పెద్దలతో పాటు వివిధ పార్టీల నేతలతో సుభాష్‌కు సత్సంబంధాలున్నాయి. సుభాష్‌ కూడా తొలి నుంచి జగన్ వెంటే నడిచారు. కాబట్టి ఢిల్లీ స్థాయిలో సుభాష్ అన్ని వ్యవహారాలను చక్కబెట్టగలరనేది జగన్ నమ్మకం. ఈ నెల 3, 4 తేదీల్లో జరిగే పార్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్