గత కొన్నాళ్ళుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజులను లక్ష డాలర్లకు పెంచడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ముఖ్యంగా అమెరికా కంపెనీలు పదే పదే ప్రతిభను ఆధారంగా చేసుకుని, విదేశీ కార్మికులను నియమించుకుంటున్న నేపధ్యంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వైట్ హౌస్ సమర్ధించింది.
Also Read : రాజా సాబ్ షూటింగ్ ఇష్యూస్.. చేతులెత్తేసిన నిర్మాత
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ విదేశీ కార్మికుల విషయంలో కొంత సానుకూలంగానే ఉన్నప్పటికీ.. అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యత తగ్గిస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఈ విషయంలో ట్రంప్ ఎంతో సూక్ష్మంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారన్నారు. విదేశీ కంపెనీలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ట్రిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయో లేదో ఆయన చూడాలనుకుంటున్నారని, కానీ విదేశీ కార్మికులకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అసహనం వ్యక్తం చేసారు.
Also Read : కుప్పకూలిన బ్యాటింగ్.. భారీ పరాజయం దిశగా టీమిండియా
తయారీ ప్లాంట్ లు, ఫ్యాక్టరీలు విదేశీ కార్మికుల వైపే మొగ్గు చూపుతున్నాయని అన్నారు. ఈ అంశంపై అధ్యక్షుడి వైఖరిని అపార్ధం చేసుకున్నారని, అమెరికాలో పెట్టుబడి పెట్టినప్పుడు అమెరికన్ ఉద్యోగులను తీసుకోవడమే మంచిది అన్నారు. ఆరిజోనాలో బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసి ఓ కంప్యూటర్ చిప్ తయారి సంస్థలో ఎక్కువగా విదేశీ కార్మికులే ఉన్నారన్నారు. ఈ వైఖరి మారకపోతే మాత్రం కంపెనీలు ఇబ్బంది పడతాయని హెచ్చరించారు. అమెరికాలో నిరుద్యోగులు పెరుగుతున్నప్పుడు.. విదేశీ కార్మికుల రాకను స్వాగతించలేమన్నారు.

