Friday, September 12, 2025 06:36 PM
Friday, September 12, 2025 06:36 PM
roots

నిద్రించే సమయంలో ఎటువైపు తిరిగి పడుకోవాలి?

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, పూర్తి నిద్ర అత్యంత అవసరం. మంచి నిద్ర వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది, శక్తి పునరుద్ధరించబడుతుంది. అంతేకాదు, శరీరంలోని కేలరీలు కూడా బర్న్ అవుతూ ఫిట్‌గా ఉండటానికి దోహదపడుతుంది. అందుకే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. కేవలం నిద్రపోవడం మాత్రమే కాదు, ఎలాంటి స్థితిలో నిద్రపోతున్నామనేదీ ఎంతో ముఖ్యం. సరైన నిద్ర భంగిమ వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అదే తప్పు భంగిమలో నిద్రపోతే పలు సమస్యలు తలెత్తుతాయి.

నిద్ర సమయంలో బట్టలు ఎలా ఉండాలి?

నిద్రకు అనువుగా బట్టలు చాలా తేలికగా, వదులుగా ఉండాలి. స్కిన్‌టైట్ డ్రెస్‌లు వాడకూడదు. ముఖ్యంగా కాటన్ బట్టలు అయితే మరింత మంచిది.

Also Read : ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆకుకూర కోసం ఎందుకంత డిమాండ్?

కడుపుమీద పడుకోవడం మంచిదా?

ఈ భంగిమను ‘ఫెటల్ పొజిషన్’ అంటారు. ఇది కొంతమందికి సౌకర్యంగా అనిపించినా, రాత్రంతా ఇదే స్థితిలో ఉండడం మంచిది కాదు. ఎందుకంటే శరీరంలోని అవయవాలపై అధిక ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అలాగే భోజనం చేసిన వెంటనే పడుకోవడం తగదు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ముఖంపై ముడతలు పడే అవకాశమూ ఉంటుంది.

ఎడమ వైపు పడుకోవడం మంచిదా? కుడివైపు ఎలా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎడమ వైపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆసిడ్ రిఫ్లక్స్ తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలకైతే ఇది మరింత ఉపయోగకరం. అయితే దీర్ఘకాలం ఎడమ వైపు మాత్రమే పడుకుంటే, భుజం, చేయి మీద ఒత్తిడి వచ్చే అవకాశముంది. కుడివైపు పడుకుంటే గురక తగ్గుతుంది కానీ ఆసిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వెల్లకిలా నిద్రపోవడం ఎలా ఉంటుంది?

వెల్లకిలా పడుకోవడం వల్ల మెడ, తల, నడుము ఒకే వరుసలో ఉండటంతో ఇది ఆరోగ్యకరమైన నిద్ర భంగిమగా చెబుతారు. కానీ నిద్రలో మనం కదులుతూ ఉండటం ఉండడం సహజమే. కాబట్టి మీరు ఏ వైపు తిరిగినా, అది శరీరానికి తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. వెల్లకిలా పడుకోవడం వలన అన్ని శరీర భాగాలకి రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది.

Also Read : బజ్ బాల్ ఎక్కడ..? భారత్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ కు షేక్ అయింది…!

నిద్ర మన ఆరోగ్యానికి పునాదిలా ఉంటుంది. సరైన పద్దతిలో, సరైన సమయంలో, సరైన మోతాదులో నిద్రిస్తూ ఉంటే మన ఆరోగ్య ప్రయాణం మరింత మెరుగవుతుంది. కాబట్టి, రాత్రిపూట నిద్రలో కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్