Wednesday, February 4, 2026 05:53 PM
Wednesday, February 4, 2026 05:53 PM

ఏమయ్యారు వాళ్లంతా.. ప్రజలు మర్చిపోయారా..?

ఏపీలో ఎన్నికలు జరిగి 14 నెలలు దాటింది. భారీ మెజారిటీతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలతో భేటీలు, పరిశ్రమల ఏర్పాటు, అమరావతి నిర్మాణ పనులపై దృష్టి, పోలవరం ప్రాజెక్టు పూర్తితో బాబు సర్కార్ తలమునకలై ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత ఇసుక, నూతన మద్యం పాలసీ, మెగా డీఎస్సీ నిర్వహణ పూర్తి చేశారు. ఓ వైపు ప్రభుత్వం అభివృద్ది పనుల్లో తలమునకలై ఉంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పదే పదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

Also Read : రేషన్ అక్రమాలతో తలనొప్పి.. రెచ్చిపోతున్న మాఫియా..!

వై నాట్ 175 అని ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చాయి. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, కడప, విశాఖ జిల్లాల్లో మాత్రమే వైసీపీకి ప్రజా ప్రతినిధులు ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో కనీసం బోణీ కూడా కొట్టలేదు. వైసీపీ పరువు పోయింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో పార్టీ నేతలంతా సైలెంట్ అయ్యారు. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు వైసీపీ అధినేత జగన్ అప్పుడప్పుడు జిల్లాల్లో పర్యటిస్తున్నప్పటికీ.. ఆ సమయంలో మంచి పేరు కంటే.. ప్రజల్లో చెడ్డపేరే ఎక్కువగా వస్తోంది. దీంతో పార్టీ కార్యక్రమాలంటే ఎవరూ ముందుకు రావడం లేదు. జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో కార్యకర్తలు లేకపోవడంతో సాక్షి టీవీలో బంగారుపాళ్యం వీడియో చూపించారని హోమ్ మంత్రి అనిత ఆరోపించారు కూడా.

Also Read : బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా..?

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోపర్యటించడం లేదనేది సొంత పార్టీ నేతల ఆరోపణ. గెలిచిన 11 మంది ఎవరు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు తప్ప.. మిగిలిన వాళ్ల పేర్లు మర్చిపోయామనేది సొంత పార్టీ నేతలు, కార్యకర్తల మాట. జిల్లా రివ్యూ సమావేశాలకు, ఆయా మునిసిపల్ కౌన్సిల్ సమావేశాలకు కూడా వైసీపీ ప్రజా ప్రతినిధులు రావటం లేదు. వైసీపీ గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఇంఛార్జులే పెత్తనం చేస్తున్నారు. అధికారులు కూడా టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. వైఎస్ జగన్ బెంగళూరుకు పరిమితం అవ్వగా.. పెద్దిరెడ్డి మాత్రం.. కొడుకు మిథున్ రెడ్డిని జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులు తప్ప.. సొంత పార్టీ కార్యకర్తలకు సదరు ఎమ్మెల్యే ఏ మాత్రం అందుబాటులో లేడు అనే మాట ఇప్పుడు వైసీపీలోనే బాగా వినిపిస్తోంది. కొంతమంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్లు అయితే.. ఆ 11 మంది పేర్లు కూడా మర్చిపోయామంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్