Sunday, March 22, 2026 11:33 AM
Sunday, March 22, 2026 11:33 AM

బాబు గారు.. ఆ మాట మర్చిపోయారా..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటింది. చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నారు. అటు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, ఇటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తాజాగా అమరావతిలో 25 బ్యాంకుల రీజనల్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఓ వైపు అభివృద్ధి పనులు చేపడుతూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. త్వరలో 3 లక్షల టిడ్కో ఇళ్లను కూడా అర్హులకు అందిస్తామని ప్రకటించారు.

Also Read : దేశ రాజధానిలో వాలిన తెలంగాణా ఈగల్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం.. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాలన.. ఐదేళ్ల పాటు అదే మాదిరిగా కొనసాగింది. అమరావతి రైతులపై తప్పుడు కేసులు, టీడీపీ శ్రేణులపై దాడులు, ఉద్యోగులపై వేధింపులు, చంద్రబాబు అక్రమ అరెస్టు.. ఇలా ఒకటేమిటి.. లెక్కలేనన్ని ఉన్నాయి. బటన్ నొక్కాం కాబట్టి ఓట్లు వస్తాయని వైసీపీ నేతలు భావించారు. కానీ ఓటర్లు మాత్రం కూటమి పార్టీల గుర్తుల బటన్ పైన గట్టిగా నొక్కి తీర్పు చెప్పారు. ఇక కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది టీడీపీ శ్రేణులు. అక్రమ కేసులు, దాడులతో విసిగిపోయిన తెలుగు తమ్ముళ్లు.. వైసీపీ ఓడితేనే తామంతా ఊపిరి పీల్చుకుంటామని భావించారు.

Also Read : అయ్యన్నార్ దెబ్బకు వైవీ ఉక్కిరిబిక్కిరి

ఇక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అక్రమ కేసులు బనాయించిన వైసీపీ అనుకూల అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. వైసీపీ సర్కార్‌లో ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు కూడా. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన ఇప్పటికే 16 నెలలు దాటింది. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి అక్రమార్కులపై చర్యలుంటాయన్నారు చంద్రబాబు. కానీ ఇప్పటి వరకు కమిషన్ ఊసే లేదు. తాజాగా చంద్రబాబు మీద నమోదైన ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేసులో మాత్రం మాజీ, తాజా ఎండీలు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని సీఐడీ ఇచ్చిన నివేదికతో ఏకీభవిస్తున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేశారు. దీంతో ఈ కేసు దాదాపు ముగిసినట్లే అని తెలుస్తోంది. కానీ ఇదే కేసులో తాజాగా జగన్ సర్కార్‌లో ఏఏజీగా పని చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం.. కోర్టులోనే ప్రభుత్వంపైన, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పైన గట్టిగా కేకలు వేశారు. నాడు చంద్రబాబు సహా టీడీపీ నేతలపై అక్రమ కేసుల వెనుక పొన్నవోలు హస్తం కూడా ఉంది. కానీ ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. పొన్నవోలు పైనే కాదు.. ఎంతో మంది వైసీపీ అనుకూల అధికారులు ఇప్పటికీ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో టీడీపీ శ్రేణులకు ఇచ్చిన ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్