అభివృద్ధి పరంగా ఎంతో ముందుండే అమెరికా.. గన్ కల్చర్ విషయంలో మాత్రం ఉగ్రవాద ప్రభావిత దేశాలతో పోటీపడుతోంది. 1971 నుంచి అమెరికాలో గన్ కల్చర్ ఓ స్థాయిలో పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ కాల్పుల్లో బలవుతూనే ఉన్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పుల ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. బలమైనవిగా చెప్పుకునే అమెరికా చట్టాలు.. మనుషుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ గన్ కల్చర్ విషయంలో మాత్రం రాజ్యాంగాన్ని మార్చలేకపోతున్నాయి అమెరికా ప్రభుత్వాలు.
Also Read : ఫోన్ కోసం కక్కుర్తి.. కల్తీ నెయ్యిలో సంచలన విషయాలు
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. అసలు అమెరికన్లకు గన్ స్వేచ్ఛగా కొనుక్కునే హక్కు ఎప్పుడు కల్పించారు.. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. 1971లో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా పౌరులకు గన్ కొనుక్కునే అధికారాన్ని కల్పించారు. సాధారణంగా భారత్ లాంటి దేశాల్లో పౌరులకు తుపాకీ ఉండాలి అంటే అనేక నిబంధనలు ఉంటాయి. అది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం. కానీ అమెరికాలో 18 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా సరే తుపాకీ కొనుక్కోవచ్చు. దానికి ఒక ఫారం పూర్తి చేసి తుపాకి ఎందుకు కొనుకుంటున్నారో స్వల్ప వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read : రైతులతో గ్యాప్ ఉంది.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కేవలం గంటన్నర వ్యవధిలో ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోతుంది. అమెరికా చట్టాల ప్రకారం ఏ పౌరుడు అయినా సరే రైఫిల్ లేదా చిన్న ఆయుధం కలిగి ఉండవచ్చు. అయితే ఏకే 47 లాంటి ప్రమాదకరమైన తుపాకులు కలిగి ఉండటానికి అనుమతి లేదు. దీనిని ది గన్ కంట్రోల్ ఆక్ట్ అని పిలుస్తారు. ఈ చట్టం వచ్చిన తర్వాత అమెరికాలో ఆయుధ సంస్కృతి పెరిగిపోయింది. అమెరికా జనాభా 33 కోట్లు అయితే అందులో 40 కోట్ల తుపాకులు ఉండటం గమనార్హం. అక్కడ యువత తుపాకీ ఉండటాన్ని గొప్పగా ఫీలవుతూ ఉంటారు. గత 40 ఏళ్లలో గన్ కల్చర్ కారణంగా 15 లక్షల మంది అధికారిక లెక్కల ప్రకారం ప్రాణాలు కోల్పోయారు.

