Saturday, March 21, 2026 11:53 PM
Saturday, March 21, 2026 11:53 PM

కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ.. సెల్యూట్ విరాట్ భాయ్

గత రెండేళ్ల నుంచి టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పై జరిగిన ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. జట్టు విఫలమైన ప్రతిసారి కోహ్లీని టార్గెట్ గా చేసుకొని ఓ వర్గం మీడియా చేసిన ప్రచారం ఆందోళన కలిగించింది. 2024 ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు ఓటమికి కోహ్లీనే ప్రధాన కారణమంటూ.. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం లేదంటూ ప్రచారం చేశారు. రంజీలు ఆడాల్సిందే అంటూ జట్టు యాజమాన్యం ఒత్తిడి పెంచింది. ఇక 2027 ప్రపంచ కప్ వరకు ఆడాలి అంటే ఖచ్చితంగా కోహ్లీ.. విజయ్ హజారే ట్రోఫీ ఆడాలనేది బోర్డు పెట్టిన నిబంధన అంటూ ప్రచారం జరిగింది.

Also Read : ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోన్న పవన్ లుక్స్.. హ్యాండ్సం డిప్యూటీ సీఎం..!

ఇక వీరి చేష్టలకు తోడు ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్లలో కోహ్లీ డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి కోహ్లీ టార్గెట్గా మరిన్ని విమర్శలు, సోషల్ మీడియాలో వెటకారపు కామెంట్స్ చూసాం. అదే పర్యటనలో మూడో వన్డే నుంచి కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్నాడు ఈ సీనియర్ ఆటగాడు. వన్డే క్రికెట్ కు మాత్రమే పరిమితమైన కోహ్లీ.. సౌత్ ఆఫ్రికా తో జరిగిన 3 వన్డేల సిరీస్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు సెంచరీలు, అర్థ శతకంతో రాణించాడు కోహ్లీ. ఇక న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో సైతం కోహ్లీ ఇదే ఆట తీరును ప్రదర్శించడం గమనార్హం.

Also Read : రాహుల్ ను ఇంకా ఎందుకు వాడట్లేదు..? షాక్ లో మాజీలు..!

మొదటి వన్డేలో ఏడు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన కోహ్లీ.. రెండో వన్డేలో కాస్త పరవాలేదు అనిపించినప్పటికీ.. మూడో వన్డేలో అతని ఆటతీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కోహ్లీ మాత్రం క్రీజ్ లో పాతుకుపోయాడు. యువ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా తో కలిసి భారత జట్టును గెలిపించేందుకు ప్రయత్నం చేశాడు. వాళ్లు ఇద్దరినీ ప్రోత్సహిస్తూ పరుగులు చేసే విధంగా ఎంకరేజ్ చేశాడు. ఇక 37 ఏళ్ల వయసులో కూడా కోహ్లీలో సెంచరీలు చేసే సామర్థ్యం చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. మునుపటి కోహ్లీని చూస్తున్నామంటూ కొనియాడుతున్నారు అభిమానులు. ఇక కోహ్లీ ఉన్నాడనే నమ్మకంతో అభిమానులు ఎనిమిది వికెట్లు పడినప్పటికీ మైదానాన్ని వీడలేదు. హర్షిత్ రానా తో కలిసి కోహ్లీ 99 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లీకి కొంత సహకారం ఉండి ఉంటే ఖచ్చితంగా భారత్ విజయాన్ని అందుకునే అవకాశం ఉండేది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్