రాయపూర్ వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ దూకుడైన ఆట తీరుతో సౌత్ ఆఫ్రికా ఆత్మరక్షణలో పడిపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా.. 70 పరుగుల లోపే రెండు వికెట్లు తీసినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం తేలిపోయింది. కోహ్లీ, గైక్వాడ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా బౌలర్ లు తేలిపోయారు. బౌలర్ లను మార్చి మార్చి ప్రయోగించినా సరే లాభం లేకుండా పోయింది. వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే.. దూకుడుగా ఆడారు.
Also Read : కోటంరెడ్డి సంచలనం.. వారి బాధ్యత నా కూతుళ్ళదే..!
డబుల్స్, సింగిల్స్ తీస్తూ.. అడపాదడపా ఫోర్లు, సిక్స్ లతో అలరించారు. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ, గైక్వాడ్ తీసిన సింగిల్స్, డబుల్స్ హైలెట్ గా నిలిచాయి. సాధారణంగా.. వేగంగా పరిగెత్తే కోహ్లీ.. గైక్వాడ్ ను కూడా అదే స్థాయిలో పరుగులు తీయించాడు. అయితే అర్ధ సెంచరీ దాటిన తర్వాత గైక్వాడ్ దూకుడు పెంచగా.. కోహ్లీ కాస్త స్లో అయ్యాడు. సింగిల్స్ తో స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించాడు. కానీ 70 పరుగుల తర్వాతి నుంచి కోహ్లీ దూకుడు పెంచాడు. అప్పటికే అలసిపోయిన సఫారి బౌలర్ లు.. లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయ్యారు.
Also Read : కోహ్లీ పనితో షాక్ అయిన గంభీర్..!
ఇది కూడా భారత్ కు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో గైక్వాడ్ 77 బంతుల్లో సెంచరీ చేసాడు. ఆ తర్వాత అవుట్ కాగా.. అనంతరం రాహుల్ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గైక్వాడ్ సెంచరీ చేసినప్పుడు డగౌట్ లో కనపడిన గంభీర్.. కోహ్లీ సెంచరీ చేసినప్పుడు మాత్రం కనపడలేదు. దీనితో కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. కోహ్లీ సెంచరీ చూడలేకనే గంభీర్ పారిపోయాడు అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అటు కోహ్లీ కూడా డగౌట్ వైపు సీరియస్ గా చూస్తూ కనిపించాడు. సెంచరీ చేసిన సమయంలో కూడా గతంలో కోహ్లీ దూకుడే మళ్ళీ మైదానంలో కనపడింది.

