Wednesday, February 4, 2026 04:02 PM
Wednesday, February 4, 2026 04:02 PM

విజయవాడ ఆటో అన్న.. మీకు సలాం..!

ఆటో డ్రైవర్లు అంటే.. అందరికీ ఓ చెడు అభిప్రాయం. ఆడవాళ్లు ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే చాలా భయపడతారు. మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయితే బాబోయ్ అనేస్తారు కూడా. మాయమాటలు చెప్పి.. భయపెట్టి తప్పుడు పనులు చేసిన ఆటో వాలాలు చాలా మంది ఉన్నారు. ఇక సినిమాల్లో కూడా ఆటో వాలాల గురించి చాలా కిడ్నాప్ కథలు వచ్చాయి. ఇక ఆటో డ్రైవర్ల భాష కూడా ఇందుకు ఒక కారణం. వారి ఆహార్యం చూసి కూడా చాలా మంది భయపడతారు. కానీ బెజవాడ ఆటో అన్నలు చేసిన పని మాత్రం.. శభాష్ అనేలా ఉంది.

Also Read : వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్..? ఆయన్ను కూడా..?

అర్థరాత్రి పూట ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే.. దగ్గరకు వెళ్లి మరీ ఆటపట్టించే ఆకతాయిలున్నారు. ఇక అందరికీ ఒకే దృష్టితో చూసే వాళ్లు కూడా ఉన్నారు. అవకాశం దొరికితే చాలు.. ఏదో ఒకటి చేయాలనే ప్లాన్ వేస్తారు. ఇక గంజాయి, మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారి మధ్య విజయవాడ ఆటో అన్నలు.. ఓ యువతికి అండగా నిలిచారు. భరోసా ఇచ్చారు. ఆకలి తీర్చారు. ఆదరించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి అర్థరాత్రి సమయంలో విజయవాడ చేరుకుంది. కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు దూరమవ్వడంతో.. తీవ్ర మానసిన వేదనతో.. ఎటు వెళ్లాలో తెలియక ఒంటరి ప్రయాణం ప్రారంభించింది. నెల్లూరు నుంచి విజయవాడ వచ్చిన యువతికి దిక్కు తోచలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న యువతిని ఆటో డ్రైవర్లు గమనించారు. ఏం కావాలని అడిగిన వారికి యువతి మాటలు కన్నీరు తెప్పించాయి.

Also Read : లోకేష్‌ బాటలో జగన్.. వర్కవుట్ అవుతుందా..?

“ఆకలిగా ఉంది.. కొంచెం టిఫిన్ పెట్టిస్తే.. తిని ఏదైనా పని చేసుకుంటా..” అంటూ యువతి చెప్పిన మాటలకు ఆటో డ్రైవర్లు చలించిపోయారు. ఆమెకు టిఫిన్ ఇప్పించారు. ఆమె పరిస్థితి తెలుసుకున్నారు. తోబుట్టువులా ఆలోచించారు. సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో వెంటనే కృష్ణలంక పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వాళ్లే నేరుగా ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐకి జరిగిన విషయం మొత్తం వివరించారు. యువతి గురించి ఆరా తీసిన పోలీసులు.. ఆమెను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. యువతికి అన్ని విధాలుగా సహాయం అందించేందుకు వాసవ్య మహిళా మండలిని ఆటో డ్రైవర్లు ఒప్పించారు.

స్వార్థం నిండిన ఈ సమాజంలో, అన్నలా మానవత్వాన్ని చాటిన ఆ ఆటో డ్రైవర్ల పైన , అలాగే ఆపదలో ఉన్న యువతికి వెంటనే స్పందించి రక్షణ కల్పించిన కృష్ణలంక పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్