మాజీ మంత్రి విడదల రజనీ చేసిన ఆరోపణలపై… ఎంపీ లావు కృష్ణ దేవరాయలు స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన… నేనేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని.. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. మావాళ్ళకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదని స్పష్టం చేసారు. భూమి మీద ఆరోపణలు చేశారని.. 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలి అని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు.
Also Read : తమ్మినేనికి మ్యూజిక్ స్టార్ట్ అయిందా…?
అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమికోసం దరఖాస్తు చేసుకున్నాయని… మా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు లేదన్నారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని అధిక ధర చెల్లించి భూమిని పొందామని తెలిపారు. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉందన్నారు. ఇదంతా మీతో ఎవరు మాట్లాడించారో నాకు బాగా తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నానని ఆరోపణలు చేసినట్టు తెలిసిందన్నారు.
Also Read : రంగంలోకి వర్మ.. ఇక వారి కోసమే..!
లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై మీరు ఫిర్యాదు చేశారని.. ఆ క్రషర్ సంస్థకు నాకు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేసారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్ ను తీసుకెళ్లి ఐపీఎస్ ఆఫీసర్ పీ. జాషువాపై ఒత్తిడి తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసారు. జాషువా గారు ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు సమాచారం ఇవ్వగా, మైన్స్ విభాగం విపరీతమైన ఫైన్ వేశారన్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని ఆ క్రషర్ సంస్థతో తనకు కప్పం కడితే వదిలేస్తానని చెప్పిన మాట నిజం కాదా? అని నిలదీశారు.
Also Read : కేశినేని చూపు బిజెపి వైపు.. ముహూర్తం ఫైనల్..?
నీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ చేసి పెడితే నాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? అంటూ మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి జాషువా గారి స్టేట్మెంట్ సహా ఇతర అధికారుల స్టేట్మెంట్లు కూడా ఉన్నాయన్నారు. నేను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి నేను మాట్లాడలేదని.. కానీ ఇప్పుడు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాని.. నాకు బూతులు చేతకావు. రజిని మాదిరిగా అబద్ధాలు చెప్పలేనన్నారు.
Also Read : ఈ వారంలోనే పదవుల భర్తీ.. వారికే పెద్ద పీట..!
ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టింది మీరే. ఇప్పుడు దీనిని మరింత ముందుకు తీసుకెళ్తాను అంటూ హెచ్చరించారు. పోతారం భాషా, ఎంపీపీ శంకర్ రావు, ముత్తా వాసు, గోల్డ్ శ్రీను, మున్నంగి, అబ్బాస్ ఖాన్, నాగయ్య, ఇలా చాలా మంది దగ్గర రజనీ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. పది రోజుల క్రితం ఒక మధ్యవర్తిని నా దగ్గరికి పంపించి ఈ కేసును ఆపమని రాయబారం నడిపిన మాట నిజం కాదా? అని నిలదీశారు. ఆ స్టోన్ క్రషర్స్ కి డబ్బులు తిరిగి చేస్తానని చెప్పిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. తప్పులు చేసిందంతా చేసి, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలా? నిలదీశారు.

