Sunday, March 22, 2026 09:52 AM
Sunday, March 22, 2026 09:52 AM

ప్రియాంక రిక్వస్ట్ తో మహేష్, రాజమౌళి షాక్ అయ్యారా..?

రాజమౌళి సినిమాలంటే సౌత్ కాదు నేషనల్ వైడ్ గా ఏదోక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ఒక్కో సినిమాతో టాలీవుడ్ నే కాదు బాలీవుడ్ ను కూడా షేక్ ఆడిస్తూ పాన్ ఇండియా డైరెక్టర్ గా దుమ్ము రేపుతున్నాడు జక్కన్న. ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసాడు. అప్డేట్ అనే పదానికి అర్ధం తెలియని జక్కన్న.. ఫాస్ట్ ఫాస్ట్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై టెన్షన్ పెంచేస్తున్నాడు.

Also Read : ఎన్టీఆర్ మార్కెట్ ను ప్రశాంత్ నిలబెడతాడా..?

ఇక ఈ సినిమా ద్వారా చాన్నాళ్ళకు.. ఇండియన్ సినిమా చేస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక. ప్రియాంక చోప్రా ఏడు సంవత్సరాల తర్వాత ఇండియన్ సినిమాలోకి అడుగు పెడుతుంది. అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరడానికి ముందు, ప్రియాంక.. జక్కన్న ముందు ఓ రిక్వస్ట్ పెట్టింది. సినిమాలో తాను రోల్ చేయాలంటే.. కనీసం ఒక్క డాన్స్ సీన్ అయినా ఉండాలని అడిగిందట. ఆమె ఈ రిక్వస్ట్ చేసినప్పుడు మహేష్ కూడా అక్కడే ఉన్నాడట. కొలైడర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా ఈ విషయం బయట పెట్టింది.

Also Read : గుంటూరు కారమా.. మజాకానా…!

డాన్స్ ద్వారా ఇండియన్ ఆడియన్స్ తో తిరిగి కనెక్ట్ అవ్వాలనే తన ఇంట్రస్ట్ బయటపెట్టింది. తాను గత ఏడేళ్ళుగా ఇండియాలో సినిమా చేయలేదు. జక్కన్న ఈ టైం లో నాకు కాల్ చేసారు. ఫిమేల్ రోల్ చాలా బాగుందని.. మీరు చేయాలని అడిగారని.. కాబట్టి తాను ఓ రిక్వెస్ట్ పెట్టినట్టు చెప్పుకొచ్చింది. చాన్నాళ్ళుగా తాను డాన్స్ చేయలేదని, ఈ సినిమాలో డాన్స్ ఉంటుందా అని తాను అడిగానని.. దానికి జక్కన్న ఓకే అనేసారు అని తెలిపింది. మహేష్ బాబు కూడా డాన్స్ చేస్తాడంటూ జక్కన్న చెప్పాడని ప్రియాంక చెప్పుకొచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్