Tuesday, March 24, 2026 02:33 PM
Tuesday, March 24, 2026 02:33 PM

వైసీపీ నేతలతో పిల్లల్ని పంపకండి.. అనిత సంచలన కామెంట్స్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్రగ్స్ కు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. విజయవాడ లాంటి ప్రాంతంలో భారీగా డ్రగ్స్ దొరకడం అప్పట్లో సంచలనమైంది. టిడిపి నేతలు ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. గంజాయి విషయంలో కూడా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పరిస్థితి ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి విషయంలో, ఇతర మాదక ద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతుంది.

Also Read : మొక్కకు మరో షాక్.. ఈసారి తీరానికే..!

ఈ నేపథ్యంలో తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు వెంట తమ పిల్లల్ని పంపించే విషయంలో తల్లిదండ్రుల అప్రమత్తం కావాలని ఆమె వ్యాఖ్యానించారు. డ్రగ్స్, గంజాయి వ్యాప్తి చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తత అవసరమన్నారు హోంమంత్రి. డ్రగ్స్ వద్దు బ్రో నినాదాలతో ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని, విద్యార్థులు, యువత జీవితాలతో ఆడుకుంటూ.. జగన్ నేతృత్వంలోని వైసిపి ఇంకా డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తుందని.. యువత జీవితాలను నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.

Also Read : ఆ విషయంలో మీరంతా దండగ..!

డ్రగ్స్ కేసులో దొరికిన కొండారెడ్డి నేతృత్వంలో.. జగన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. కొండారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అతనితో జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చూసి ఎందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. డ్రగ్స్ కు కేంద్రంగా చేసేందుకే జగన్ విశాఖను రాజధాని చేస్తా అన్నారా అంటూ మండిపడ్డారు. ఆడబిడ్డలను కించపరిచే సాక్షి మీడియాలో కథనాలు దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై తప్పుడు రాతలు రాసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!

హైదరాబాద్‌ను అధిగమించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని...

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

పోల్స్